Begin typing your search above and press return to search.
అసురుడు గా వెంకీమామ భలే ఉన్నారే!
By: Tupaki Desk | 26 Oct 2019 1:27 PM ISTసీనియర్ స్టార్ హీరోలలో వెంకీ ఇప్పుడు మంచి జోరుమీద ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 'F2' తో బ్లాక్ బస్టర్ నమోదు చేసిన ఆయన ప్రస్తుతం మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి 'వెంకీమామ' లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరిదశలో ఉంది. ఈ సినిమా కాకుండా వెంకీ మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టారని టాక్.
అందులో ఒకటి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కే స్పోర్ట్స్ డ్రామా. ఇది హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా కాకుండా తమిళ హిట్ ఫిలిం 'అసురన్' రీమేక్ లో నటించేందుకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా టాక్ వినిపిస్తోంది. వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన 'అసురన్' బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఈ సినిమాలో ధనుష్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. మరి వెంకీ ఈ వయసులో తండ్రి పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు కానీ కొడుకు పాత్రకు సెట్ అవుతారో లేదే అనే అనుమానాలు ఉన్నాయి. అయితే వీటితో సంబంధం లేకుండా వెంకీ ఫ్యాన్స్ ఇప్పటికే ఈ సినిమాకు ఫ్యాన్ మేడ్ పోస్టర్ తయారు చేశారు.
సడెన్ గా చూస్తే ఇది రియల్ పోస్టరేమో అనిపించేలా ఉంది. వెంకీ ఈ పోస్టర్ లో ఇంటెన్స్ లుక్ లో ఉన్నారు. ఆయన కామెడీలో ఎంత స్పెషలిస్టో ఇంటెన్స్ యాక్టింగ్ లో కూడా అంతే స్పెషలిస్టు. ఇలాంటి పాత్రలో వెంకీ చెలరేగిపోతారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనేది త్వరలోనే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.