Begin typing your search above and press return to search.

మెగాస్టార్ బాటలో వెంకీ వరుణ్

By:  Tupaki Desk   |   26 April 2019 11:02 AM IST
మెగాస్టార్ బాటలో వెంకీ వరుణ్
X
బాలీవుడ్ లో సాధారణమే కాని ఇంగ్లీష్ సినిమాలకు మన స్టార్లు డబ్బింగ్ చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంది. కాని ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మనదగ్గర ఇదో ట్రెండ్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల విడుదల కాబోతున్న హాలీవుడ్ క్రేజీ మూవీ అల్లాదిన్ కోసం విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ లు జీనీ అల్లాదిన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

నిన్న రిలీజైన ట్రైలర్ ఆసక్తి రేపడానికి ఇదొక కారణం అని చెప్పొచ్చు. గతంలో అవెంజర్స్ కోసం రానా డబ్బింగ్ చెప్పడం చాలా ప్లస్ అయ్యింది. ఇంతకు ముందు షారుఖ్ ఖాన్ యానిమేటెడ్ మూవీ ఇన్ క్రెడిబుల్స్ కోసం గాత్రం ఇవ్వడం సెన్సేషన్ అయ్యింది. రెండేళ్ళ క్రితం బిజిఎఫ్ కోసం జగపతిబాబు కూడా గొంతును అరువిచ్చాడు

ఇక్కడో విషయం గమనించాలి. ఈ ట్రెండ్ మొదలుపెట్టింది మాత్రం మెగాస్టార్ చిరంజీవే. 14 ఏళ్ళ క్రితం 2005లో హనుమాన్ అనే యానిమేషన్ మూవీకి చిరు ఆంజనేయుడి పాత్రకు స్వయంగా సినిమా మొత్తం డబ్బింగ్ చెప్పారు . అలా చెప్పడం అదే మొదలు అదే ఆఖరు. దానికి చిరు గాత్రం చాలా హెల్ప్ అయ్యి మంచి వసూళ్లు వచ్చేందుకు దోహదపడింది.

ఇప్పుడు వెంకటేష్ వరుణ్ తేజ్ లు కూడా ఇందులో జాయిన్ అయ్యారు అంటే ఫ్యూచర్ లో మరిన్ని హాలీవుడ్ సినిమాలలో మన స్టార్ల గొంతు వినవచ్చన్న మాట. ఎఫ్2 తర్వాత ఈ ఇద్దరు కలిసి ఇలా పని చేయడం విశేషం. గై రిచీ దర్శకత్వం వహించిన అల్లాదీన్ ని వాల్ట్ డిస్నీ సంస్థ భారీ ఎత్తున విడుదల చేయనుంది