Begin typing your search above and press return to search.

బ‌న్ని- వెంకీ 'హిట్ మ్యాన్స్'

By:  Tupaki Desk   |   13 May 2019 11:00 PM IST
బ‌న్ని- వెంకీ హిట్ మ్యాన్స్
X
ఒక్క హిట్టు ఊపిరి పోస్తుంది.. ఒక్క‌ హిట్టు అవ‌కాశాలిస్తుంది.. ఒక్క హిట్టు ఇంకేదైనా చేస్తుంది. అందుకే హిట్టు సెంటిమెంటును ఫాలో అయ్యే ప‌రిశ్ర‌మ మ‌న‌ది అని ఏనాడో ఫిక్స‌యిపోయారు. హిట్లు తెచ్చే ఏ సెంటిమెంటును అయినా ఫాలో అయ్యేందుకు వెన‌కాడ‌రు. అంతెందుకు ఎవ‌రైనా హీరోయిన్ న‌టించిన సినిమాలు ఫ్లాపైతే ఐరెన్ లెగ్ అన్న ముద్ర వేసి దూరం పెట్టేస్తారు. అదే ఫ‌లానా హీరోయిన్ న‌టించిన సినిమాల‌న్నీ హిట్టే అంటే ఆ హీరోయిన్ ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు.

అదొక్క‌టే కాదు.. ఇటీవ‌ల ఓ కొత్త సెంటిమెంట్ ప్ర‌బ‌లంగా మారుతోంది. ఫ‌లానా హీరో మా ఆడియో ఫంక్ష‌న్ కి వ‌స్తే సినిమా హిట్టేన‌న్న సెంటిమెంటును బ‌లంగా న‌మ్ముతోంది ప‌రిశ్ర‌మ‌. అలా ఇటీవ‌ల ప‌లు వేదిక‌ల‌పై అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా క‌నిపించారు. దేవ‌ర‌కొండ లాంటి హీరో ప్ర‌తిసారీ త‌న సినిమాల ప్ర‌చారానికి బ‌న్నీని ప్ర‌త్యేకంగా ఆహ్వానించ‌డం చూస్తున్న‌దే. అలాగే లేటెస్టుగా విక్ట‌రీ వెంక‌టేష్ ఏదైనా ఫంక్ష‌న్ కి వెళితే ఆ సినిమా హిట్టు గ్యారెంటీ అంటూ సెంటిమెంటు బ‌లంగా నాటుకుంది.

ఆయ‌న ప్రీరిలీజ్ వేడుక‌ల‌కు వెళ్లిన మ‌జిలీ హిట్టు. మ‌హ‌ర్షి ప్రీరిలీజ్ వేడుక‌లోనూ ఎంతో జోష్ తో ఆక‌ట్టుకున్నారు. త‌మ్ముడు ఇంత యంగ్ గా ఎలా ఉన్నాడో అంటూ మ‌హేష్ ని పొగిడేశాడు. మ‌హ‌ర్షి హిట్టు అవుతుందా లేదా అనేది తెలియ‌డానికి ఇంకాస్త స‌మ‌యం ప‌డుతుంది కానీ.. ఈలోపే వెంకీ మ‌రో ఫంక్ష‌న్ కి విచ్చేశారు. వెంకీని ప్ర‌స్తుతానికి ల‌క్కీ మ‌స్క‌ట్ గా భావించి ఆహ్వానించారు. అంత‌గా స్టార్ ప‌వ‌ర్ లేని చిన్న సినిమా ఫ‌ల‌క్ నుమా దాస్ ట్రైల‌ర్ ని వెంకీ తాజాగా లాంచ్ చేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. నేటి ఉద‌యం రామానాయుడు స్టూడియోస్ లో విక్ట‌రీ వెంక‌టేష్ ఈ ట్రైల‌ర్ ని లాంచ్ చేసి చిత్ర‌యూనిట్ కి బ్లెస్సింగ్స్ అందించారు. ఫ‌ల‌క్ నుమా దాస్ చిత్రంలోని డైలాగ్స్ ని చెప్పి యూనిట్ స‌భ్యుల్ని ఖుషీ చేశారు. మొత్తానికి వెంకీ సెంటిమెంట్ ఫ‌లించి ఈ సినిమా కూడా హిట్ట‌యితే మునుముందు ఇదే పంథాని కొన‌సాగిస్తార‌న‌డంలో సందేహ‌మేం లేదు. అయితే అప్పుడు కూడా వెంకీ ఇలానే దొరుకుతాడా అన్న‌ది మాత్రం మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం చైత‌న్య‌తో క‌లిసి వెంకీమామ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న వెంకీ వ‌రుస‌గా ప‌లు చిత్రాల్లో న‌టించేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రంలో న‌టించిన విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పెళ్లి చూపులు.. ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రాల ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ఇందులో ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.