Begin typing your search above and press return to search.

వెంకటేష్ 75.. ఈ డైరెక్టర్ ఫిక్స్ అయ్యేలా ఉన్నాడు

By:  Tupaki Desk   |   23 Dec 2022 12:30 AM GMT
వెంకటేష్ 75.. ఈ డైరెక్టర్ ఫిక్స్ అయ్యేలా ఉన్నాడు
X
దగ్గుపాటి వెంకటేష్ ల్యాండ్ మార్క్ 75వ ప్రాజెక్ట్ ఎప్పుడు తెరపైకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు., ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క ఇప్పుడు 75వ సినిమా మరొక లెక్క అనే విధంగా ఉండాలి అని వెంకటేష్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా అప్పట్లో అయితే వెంకీ ఒక సినిమా సెట్స్ పై ఉండగానే వెంటనే మరొక రెండు సినిమాలను కూడా చేయడానికి ముందుగానే ప్రణాళికలు రచిస్తూ ఉండేవాడు.

కానీ ఇప్పుడు మాత్రం సక్సెస్ రేటు బాగా తగ్గడం వలన మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని చూస్తున్నాడు. అలాగే మల్టీస్టారర్ సినిమాలైనా చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు.

కానీ ఫ్యాన్స్ ఘర్షణ, తులసి లాంటి సినిమాలను కూడా కోరుకుంటున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు పరవాలేదు అనిపించాయి. కానీ వెంకటేష్ స్థాయిని మరో లెవెల్ కు పెంచే విధంగా సినిమాలు అయితే రాలేదు.

అందుకే వెంకటేష్ 75వ సినిమాతో మాత్రం మళ్లీ తన హిస్టరీ ని రిపీట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక ల్యాండ్ మార్క్ మూవీ కోసం కొంతమంది దర్శకులను కూడా అనుకున్నారు. కానీ ఎవరూ ఫైనల్ కాలేదు. ఇక ఇప్పుడు శైలేష్ కొలను పేరు ఎక్కువగా వినిపిస్తోంది. హిట్ తో ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేసిన అతను తెలుగులో కూడా మల్టీ వర్స్ సినిమాలు రాబోతున్నట్లుగా వివరణ ఇచ్చేసాడు.

ఇక హిట్ యూనివర్స్ లో వెంకటేష్ ని కూడా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిట్ 3పై ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అర్జున్ సర్కార్ గా నాని అందులో కనిపించబోతున్నాడు.

అలాగే వెంకటేష్ తో కూడా దర్శకుడు శైలేష్ ఒక సినిమా చేసేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం. నిర్మాత సురేష్ బాబు, నాని ప్రొడక్షన్స్ తో కలిసి వెంకీ 75వ సినిమాను నిర్మించాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో కూడా అఫీషియల్ గా క్లారిటీ రానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.