Begin typing your search above and press return to search.

'అరణ్య' నుంచి మనసుకు హత్తుకునే 'వెళ్లు వెళ్లు' పాట..!

By:  Tupaki Desk   |   9 March 2021 4:10 PM GMT
అరణ్య నుంచి మనసుకు హత్తుకునే వెళ్లు వెళ్లు పాట..!
X
ద‌గ్గుబాటి రానా నటిస్తున్న తాజా చిత్రం ''అరణ్య''. తెలుగు తమిళ హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్ర‌భు సాల్మ‌న్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తమిళ నటుడు విష్ణు విశాల్ - జోయా హుస్సేన్‌ - శ్రియ పిల్గావోంక‌ర్ ఇతర ముఖ్య పాత్ర‌ల్లో కనిపిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సమ్మర్ కానుకగా మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలో తాజాగా 'అరణ్య' నుంచి 'వెళ్లు వెళ్ళు' అనే పాటను విడుదల చేశారు.

'వెళ్లు వెళ్లు వెళ్లవే అలా.. వెచ్చనైన ఊహ నువ్వలా' అంటూ సాగే పాటకు శాంతను మోయిత్ర స్వరాలు సమకూర్చారు. లిరిసిస్ట్ వనమాలి సాహిత్యం అందించగా.. హరిచరణ్‌ ఈ ప్రేమ గీతాన్ని ఆలపించారు. ఈ సాంగ్ అడవుల్లో విష్ణు విశాల్‌ - జోయా హుస్సేన్‌ జంటపై చిత్రీకరించారు. దీనికి ఎ.ఆర్‌. అశోక్ కుమార్ అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మనసుకు హత్తుకునేలా ఉన్న ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇకపోతే ఈ సినిమా హిందీలో 'హథీ మేరే సాథి'.. తమిళంలో 'కాదన్' పేర్లతో విడుదల కానుంది. పర్యావరణ సమస్యలు - అటవీ నిర్మూలన - జంతువుల సంరక్షణ వంటి అంశాలను చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.