Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఇందులో ఏదో ఉంది

By:  Tupaki Desk   |   6 March 2017 12:10 PM IST
ట్రైలర్ టాక్: ఇందులో ఏదో ఉంది
X
చడీచప్పుడు లేకుండా తెలుగులో ఒక ట్రైలర్ రిలీజైంది. ఆ ట్రైలర్ రిలీజ్ చేసింది అగ్ర నిర్మాత దిల్ రాజు కావడం విశేషం. ఆయనకు ‘వెళ్లిపోమాకే’ అనే చిన్న సినిమా నచ్చేసి దాన్ని తన బేనర్ మీద రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాని ట్రైలర్‌ దిల్ రాజు రిలీజ్ చేశాడు. ఇంతకీ ఈ ట్రైలర్లో ఏముందో చూద్దాం పదండి.

ఇంట్రావర్ట్ అయిన ఓ అబ్బాయి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటాడు. ఆ కంపెనీలోకి కొత్తగా ఓ అమ్మాయి వచ్చి చేరుతుంది. ఆమెతో అతడికి పరిచయం ఏర్పడుతుంది. మరోవైపు ఇంకో అమ్మాయి అతడికి దగ్గరవుతుంది. వీళ్లిద్దరితో అతడి జర్నీ ఎలా సాగిందన్నది ఈ చిత్ర కథ. ట్రైలర్ చూస్తే కథ.. పాత్రల పరంగా మామూలుగా అనిపిస్తూనే.. ఈ కథను చెప్పడంలో దర్శకుడు ఏదో ప్రత్యేకత చూపించినట్లే అనిపిస్తోంది. మంచి ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది ‘వెళ్లిపోమాకే’. సినిమాలో ఒక ఇంటెన్సిటీ ఉండేలా కనిపిస్తోంది.

కొందరు ప్యాషనేట్ ఫిలిం బఫ్స్ కలిసి ఈ సినిమా చేశారని.. ఇలాంటి సినిమాను ఆదరిస్తే భవిష్యత్తులో ఇలాంటి మంచి ప్రయత్నాలు మరిన్ని జరుగుతాయని దిల్ రాజు మళ్లీ మళ్లీ చెబుతున్నాడు. ఈ సినిమా రిలీజయ్యాక దీన్ని ఎలా తీశారో ఒక క్లాస్ కూడా పెట్టాలనుకుంటున్నట్లు రాజు చెప్పడం విశేషం. రెహమాన్ దగ్గర శిష్యరికం చేసిన ప్రశాంత్ విహారి అందించిన పాటలకు మంచి స్పందనే వస్తోంది. ముఖ్యంగా ‘ఓ మూగ మనసా’ పాట సోషల్ మీడియాలో బాగా పాపులరైంది. అందరూ కొత్త వాళ్లతో యాకూబ్ అలీ తీసిన ఈ చిత్రం ప్రేక్షకులపై ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/