Begin typing your search above and press return to search.

తన సినిమా ఫ్లాప్ అని ఒప్పుకున్న డైరెక్టర్

By:  Tupaki Desk   |   18 Oct 2016 9:30 AM GMT
తన సినిమా ఫ్లాప్ అని ఒప్పుకున్న డైరెక్టర్
X
తన సినిమా విడుదలైన కొన్ని రోజులకే.. అది ప్రేక్షకుల్ని నిరాశ పరిచిందని ఒప్పుకోవాలంటే ఒక దర్శకుడికి దమ్ముండాలి. అలాంటి దమ్ము మామూలుగా రామ్ గోపాల్ వర్మలో మాత్రమే కనిపిస్తుంది. సినిమా థియేటర్లలో ఉండగా ఫలితం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆ తర్వాత కూడా ఫ్లాస్ సినిమాను హిట్ అని చెప్పుకుంటేనే వెనకాల సెటైర్లు పడిపోతుంటాయి. చాలామంది దర్శకులు తమ సినిమా పోయినా.. ఆ విషయం ముందు అంగీకరించరు. కొన్ని నెలలు గడిచాక కానీ వాస్తవంలోకి రారు. ఐతే రైటర్ టర్న్డ్ డైరెక్టర్ వీరూ పోట్ల మాత్రం తన సినిమా ఫలితం గురించి.. విడుదలైన కొన్ని రోజులకే ఓపెన్ అయిపోయాడు.

బిందాస్.. రగడ.. దూసుకెళ్తా లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు అందించిన వీరూ.. ‘ఈడు గోల్డ్ ఎహే’తో నిరాశ పరిచాడు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అంతిమంగా సినిమా ఫ్లాప్ అని తేలింది. ఈ సినిమా విషయంలో వీరూకు నిర్మాత అనిల్ సుంకర ఫ్రీడమ్ ఇవ్వలేదని.. ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరూ స్పందించాడు. ‘‘ఈడు గోల్డ్ ఎహే చిత్రాన్ని మెచ్చిన వాళ్లకు థ్యాంక్స్. ఈ సినిమాతో నిరాశ పరిచినందుకు మత్రం మన్నించమని కోరుతున్నా. ఆత్మ పరిశీలన చేసుకుని.. ఈసారి స్క్రిప్టు విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటాను. ‘ఈడు గోల్డ్ ఎహే’ స్క్రిప్టు.. మేకింగ్ విషయంలో నిర్మాత అనిల్ సుంకర నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయన నిజమైన జెంటిల్మన్’’ అని క్లారిటీ ఇచ్చాడు వీరూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/