Begin typing your search above and press return to search.

మంచు క్యాంపు హ్యాండ్‌ అందిస్తోంది

By:  Tupaki Desk   |   12 Sep 2015 7:21 AM GMT
మంచు క్యాంపు హ్యాండ్‌ అందిస్తోంది
X
మంచు మ‌నోజ్ హీరోగా బిందాస్ (2010) తెర‌కెక్కించాడు వీరూపోట్ల‌. అంత‌వ‌ర‌కూ ఒడిదుడుకుల్లో ఉన్న మ‌నోజ్ కెరీర్‌ కి క‌మర్షియ‌ల్ హిట్టిచ్చి పెర్‌ఫెక్టుగా సెట్ చేశాడు. అలాగే చాలా కాలంగా ఏ క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక ఇబ్బందుల్లో ప‌డిన మంచు విష్ణుకి కూడా స‌రైన టైమ్‌ లో దూసుకెళ్తా (2013) వంటి సూప‌ర్ హిట్ ఇచ్చి ఆదుకున్నాడు. అందుకే మంచు క్యాంపుకి వీరూపోట్ల అంటే ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఓ ర‌కంగా చెప్పాలంటే వీరూ మంచు ఫ్యామిలీ హీరోల ద‌ర్శ‌కుడిగా పాపుల‌ర్ అయ్యాడు. కానీ ప్ర‌స్తుతం వీరూ పోట్ల కెరీర్ ఆశించినంత స్పీడ్‌ లో లేదు. ఇలాంటి టైమ్‌లో మంచు ఫ్యామిలీ అత‌డిని ఆదుకుంటుందా? అత‌డి కోసం మ‌నోజ్, విష్ణు కాల్షీట్లు ఇవ్వ‌డానికి రెడీగా ఉన్నారా? లేరా? అన్న ఆస‌క్తిక‌ర డిష్క‌స‌న్ ఫిలింన‌గ‌ర్‌ లో సాగుతోంది.

మ‌నోజ్ ఇప్ప‌టికే పెళ్లి త‌ర్వాత కెరీర్‌ కి సంబంధించిన ప్లానింగ్‌ లో స్పీడ్ పెంచేస్తున్నాడు. ఆర్జీవీతో ఎటాక్ మ‌ధ్య‌లోనే ఆగినా అత‌డు ఇప్పుడు ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవ‌ల గ్యాప్‌ లో జిమ్ములేక కాస్త దేహాకృతి మారిపోయింది. తిరిగి జిమ్‌లో రీజాయిన్ అయ్యి దానిని సెట్ చేసే ప‌నిలో ఉన్నాడు. సేమ్ టైమ్ ద‌శ‌ర‌థ్‌ తో క‌థా చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటున్నాడు. ఇది పూర్త‌య్యాక వీరూపోట్ల‌తో బిందాస్ 2లో న‌టించేందుకు ఓకే చెప్పాడ‌ని చెబుతున్నారు. వీరూ స్ర్కిప్టు రెడీ చేసి మ‌నోజ్‌ ని క‌ల‌వ‌డ‌మే ఆల‌స్యం. పోట్ల గిత్త‌ల్లా ఇద్ద‌రూ రంగంలోకి దూకేయ‌డ‌మేన‌ని చెబుతున్నారు. వీరూపోట్ల వెంక‌టేష్ హీరోగా ఓ సినిమా చేయాల‌ని అనుకున్నా అది వీలు చిక్క‌లేదు. అందుకే ఇప్పుడు మంచు క్యాంప్ అవ‌కాశం అత‌డికి అత్యంత అవ‌స‌రం. ఓ యంగ్ ట్యాలెంటెడ్ ద‌ర్శ‌కుడికి ఇలాంటి టైమ్‌ లో కావాల్సిన అండా దండా మంచు ఫ్యామిలీ హీరోలు ఇచ్చి ఎంక‌రేజ్ చేయ‌డం అభినంద‌నీయం.