Begin typing your search above and press return to search.

CMO నుంచి కొన్ని SPECIAL ఆర్డ‌ర్స్ వ‌చ్చాయ‌ట‌! వీర‌య్య‌ పంచ్ ఎవ‌రినుద్ధేశించి?!

By:  Tupaki Desk   |   9 Jan 2023 4:00 AM GMT
CMO నుంచి కొన్ని SPECIAL ఆర్డ‌ర్స్ వ‌చ్చాయ‌ట‌! వీర‌య్య‌ పంచ్ ఎవ‌రినుద్ధేశించి?!
X
బాస్ చిరంజీవిలో విల‌క్ష‌ణ శైలి ఎవ‌రినీ హ‌ర్ట్ చేయ‌కుండా మాట్లాడే శైలి గురించి వాల్తేరు వీర‌య్య ప్రీరిలీజ్ వేదిక‌పై బాబి ఎంతో పొలైట్ గా చెప్పారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ సైతం చిరులోని ఒదిగి ఉండే స్వ‌భావం శాంత‌జీవి గురించి బాబితో ఏకీభ‌వించారు. నిజానికి వాల్తేరు వీర‌య్య ఈవెంట్ వైజాగ్ ఏయు గ్రౌండ్స్ లో 6 పీఎం జ‌రుగుతుందా లేదా? అన్న టెన్ష‌న్ తోనే మెగాస్టార్ చిరంజీవి - బాబి-ర‌వితేజ టీమ్ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూసారు. అప్ప‌టికే ఆర్కే బీచ్ లో సెట్టింగులు రెడీ అయ్యాయి. భారీగా ఖ‌ర్చు చేసి ఎల్.ఇ.డిలు స‌హా ప్ర‌తిదీ అమ‌ర్చారు. ముందు అనుమ‌తి ఇచ్చి త‌ర్వాత లేద‌న్నారు. కాద‌న్నారు. దాంతో వెన్యూని చివ‌రి నిమిషంలో హుఠాహుఠీన మార్చాల్సి వచ్చింది. వాల్తేరు వీర‌య్య ప్రీరిలీజ్ ఈవెంట్ కి చాలా ద‌గ్గ‌ర‌గా బాంబ్ లాంటి ప్ర‌భుత్వ‌ జీవో ఎంతో ఇబ్బంది పెట్టింది. అప్ప‌టికే చేసుకున్న ఏర్పాట్ల‌న్నిటినీ ఇది డిస్ట్ర‌బ్ చేయ‌డంతో అస‌లు ఈవెంట్ జ‌రుగుతుందా? లేదా? అన్న సందేహాలు అలుముకున్నాయి.

ఆ టెన్ష‌న్ మెగాస్టార్ చిరంజీవి స‌హా టోట‌ల్ టీమ్ లో క‌నిపించిందని వెన్యూ నిర్వాహ‌కుల్లో ఒక‌రు తుపాకికి వెల్ల‌డించారు. అయితే ఇంత‌టి ప్ర‌తిష్ఠాత్మ‌క ఈవెంట్ జ‌రుగుతుందా లేదా అనే టెన్ష‌న్ ని కూడా బాస్ చిరంజీవి ముఖంలో క‌నిపించ‌కుండా మ్యానేజ్ చేసారంటే అర్థం చేసుకోవాల‌ని అత‌డు వ్యాఖ్యానించారు. సాయంత్రం 6 దాటాకే వెన్యూ రెడీ అయ్యింది ఎలాగోలా. ఈవెంట్ కూడా ఆల‌స్యంగా మొద‌లైంది. అనుకున్న స‌మ‌యానికి ఏదీ మొద‌లు కాలేదు. అనుకున్న చాలా కార్య‌క్ర‌మాలు కూడా కోత‌కు గుర‌య్యాయి. ఏది ఏమైనా ఈవెంట్ ని గ్రాండ్ స‌క్సెస్ చేయ‌డంలో ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ ప‌నిత‌నం కూడా ఉంది. దీనిని బాస్ చిరంజీవి చాలా మెచ్చుకున్నారు.

ఇక‌పోతే ఈ ఈవెంట్ వాయిదా గురించి మీడియా అడిగే ప్ర‌తి ప్ర‌శ్న‌కు మెగాస్టార్ ఎంతో హుందాగా స‌మాధానాలిచ్చారు. ఏయూ ఇంజినీరింగ్ గ్రౌడ్స్‌లో వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు షిఫ్ట‌య్యాక ఆ టెన్ష‌న్ టీమ్ ని కుదిపేసింది. ఈ వేదిక‌కు హాజరయ్యేందుకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అండ్ టీమ్ శంషాబాద్ విమానాశ్రయానికి చాలా ముందుగా చేరుకోగా.. ఎయిర్ పోర్ట్ లో మీడియా త‌న‌ను ప్ర‌శ్నించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ మార్పు అంశంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయ‌న త‌న‌దైన శైలిలో స్పందించారు. ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని.. వారి(ప్ర‌భుత్వాధికారులు-పోలీసులు) సౌలభ్యం మేరకు అనుమతి ఇస్తార‌ని వ్యాఖ్యానించారు.

ఆర్కే బీచ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి నిరాకరించిన ఏపీ పోలీసులు ఏయూ (ఆంధ్రా యూనివ‌ర్శిటీ) గ్రౌండ్స్‌కి షిఫ్ట్ చేశామ‌ని చిరు తెలిపారు. నిజానికి ఆర్కే బీచ్ కు అనుమతి ఇచ్చినా ఆ త‌ర్వాత జీవో1 విడుద‌లైంది. పోలీస్ అధికారుల‌ నియ‌మావ‌ళి ప్ర‌కారం బీచ్ లో కాకుండా ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ప్రీరిలీజ్ వేడుక‌ను నిర్వహించాల్సి వ‌చ్చింది. ఈ వ్యవహారం పైన తాను స్పందించనని తొలుత చెప్పిన చిరంజీవి.. అక్కడి పరిస్థితులకు అనుగుణం అధికారులు నిర్ణయం తీసుకుంటారని పరోక్షంగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించి త‌న హుందాత‌నాన్ని ప్ర‌ద‌ర్శించారు.

ఇక ఈవెంట్ క్లోజింగ్ టైమ్ లో చిరు చేసిన ఒక సింపుల్ కామెంట్ ఇప్పుడు మెగాభిమానులు స‌హా విశాఖ వాసులు ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. "స్థ‌లాలు (వెన్యూ) మారిపోయాయి.. ఈవెంట్ చేస్తామో లేదో అనుకున్న టైమ్ లో వార్ త‌ర‌హాలో ఈవెంట్ న‌డిపించామ‌"ని చిరు గుంబ‌న‌గా అన్నారు.

మొద‌ట ఆర్కే బీచ్ లో వేడుక‌ను చేయాలని ఏర్పాట్లు చేసాం. కానీ అక్కడ స‌ముద్రం ఆటుపోట్లు ఉంటాయ‌ని చెప్పారు. ఎందుకైనా మంచిద‌ని ఏయు గ్రౌండ్స్ కి మార్చ‌డం మంచికే అయ్యింది. విశాఖ‌ప‌ట్నం సీపీ శ్రీ‌కాంత్ స‌ల‌హా మంచిదైంది" అని కూడా చిరు తెలిపారు. అంతేకాదు... "సీపీ-క‌మీష‌న‌ర్-డీజీపీ" వారికి ఏపీ- CMO నుంచి కొన్ని SPECIAL ఆర్డ‌ర్స్ వ‌చ్చాయ‌ట‌! అంటూ నొక్కి ప‌లుకుతూ చిరు త‌న‌దైన శైలిలో పంచ్ విసిరారు. విశాఖ పోలీసుల‌కు సీఎంవోకు కూడా బాస్ త‌న‌దైన శైలిలో ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇదీ మెగా బాస్ స్టైల్ అనేలా ఎలాంటి ఎమోష‌న్ ని క‌న‌బ‌ర‌చ‌కుండా కూల్ గా చిరు ఎంతో వేదిక‌పై ఎంజాయ్ చేస్తూ మాట్లాడిన తీరు అంద‌రికీ ఒక పాఠం లాంటిది. ప్ర‌తి చిన్న విష‌యానికి ఎమోష‌న‌ల్ అయ్యే చాలా మందికి ఇది నిజంగా గుణ‌పాఠం లాంటిది.

"డోంట్ స్టాప్ సీయింగ్.. గాడ్ సీయింగ్.." అంటూ చివ‌రిలో మెగాస్టార్ త‌న‌దైన శైలిలో ఒక పంచ్ కూడా విసిరారు. అది ఎవ‌రినుద్ధేశించి? అన్న‌ది అటుంచితే వేదిక‌పై ఎక్క‌డా హుందా త‌నం చెక్కు చెద‌ర‌కుండా కాపాడుకుంటూ ఇలాంటి టెన్ష‌న్ టైమ్ లో కూడా నిండుకుండ‌లా క‌నిపించారు చిరు. అందుకే ప‌రిశ్ర‌మ‌లో మెగాస్టార్ ఒక్క‌డే.. అది చిరంజీవి మాత్ర‌మేన‌ని ద‌ర్శ‌కుడు బాబి స‌హా అంతా పొగిడేశారు. ఆయ‌న త‌న‌ను అన్న(తెగిడే) వాళ్ల‌ను కూడా తిరిగి అనేందుకు ఇష్ట‌ప‌డ‌రు. ఎంతో స‌హ‌నం ఓర్పుతో ఉంటారు. ఎమోష‌న్ అయిపోయి ఊగిపోరు. భీమిలిలో స్థ‌లం కొన్నాను.. ఈసారి వ‌చ్చిన‌ప్పుడు ఇల్లు క‌ట్టుకోవ‌డానికొస్తాను! అంటూ ఈవెంట్ ముగింపులో చిరు సంతోష‌క‌ర‌మైన మోముతో చెప్పిన‌ తీరు చూస్తే విశాఖ‌పై చిరు ప్రేమ ఎలాంటిదో కూడా అభిమానుల‌కు అర్థ‌మైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.