Begin typing your search above and press return to search.

వీరసింహారెడ్డి.. ఇప్పుడు మాస్ నెంబర్ లోడింగ్!

By:  Tupaki Desk   |   20 Dec 2022 8:30 AM GMT
వీరసింహారెడ్డి.. ఇప్పుడు మాస్ నెంబర్ లోడింగ్!
X
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి 2023 జనవరి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా కమర్షియల్ సినిమాగా పోటీగా ఉన్నప్పటికీ కూడా బాలయ్య సినిమాపై అంచనాలు అయితే ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది.

ఇక రాబోయే రోజుల్లో మరింత హైప్ క్రియేట్ చేసే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు అప్డేట్స్ ఇవ్వబోతున్నారు. అయితే ఇటీవల విడుదల చేసిన మొదటి సాంగ్ జై బాలయ్య అనుకూనంత స్థాయిలో అయితే క్లిక్ కాలేదు. అంతే కాకుండా ఆ పాటపై కొంత ట్రోలింగ్ కూడా నడిచింది. రాములమ్మ పాటను కాపీ కొట్టాడు అని కూడా కామెంట్ చేశారు. ఇక ఆ తర్వాత వచ్చిన సుగుణ సుందరి మాత్రం పరవాలేదు అనిపించింది. కానీ ఇప్పుడు మూడవ సాంగ్ మాత్రం తప్పకుండా హై రేంజ్ లో ఉండాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అందుకు తగ్గట్టుగా థమన్ కూడా పవర్ఫుల్ సాంగ్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే మూడవ స్పెషల్ ఐటెం సాంగ్ గా దాన్ని డిజైన్ చేశారట. సినిమాలో హైలెట్ గా నిలుస్తుందట. ఇక మొత్తానికి ప్రస్తుతం ఆ మాస్ సాంగ్ విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 25వ తేదీన ఫ్యాన్స్ కు నచ్చే విధంగా సాంగ్ లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నారు.

అంతే కాకుండా ఈ పాటలో బాలకృష్ణ డాన్స్ స్టెప్పులు కూడా హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా దాదాపు తుది దశకు చేరుకున్నాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మరో సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. మరి అఖండ తర్వాత వస్తున్న బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.