Begin typing your search above and press return to search.

వీర‌మ‌ల్లు వ‌ర్సెస్ మాచర్ల నియోజకవర్గం!

By:  Tupaki Desk   |   13 Nov 2021 10:30 AM GMT
వీర‌మ‌ల్లు వ‌ర్సెస్ మాచర్ల నియోజకవర్గం!
X
అవును.. ఇది విచిత్ర‌మే! కానీ నిజం!! ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకి పోటీగా ఆయ‌న‌ అభిమాని సినిమా బ‌రిలో దిగుతోంది. బాక్సాఫీస్ వ‌ద్ద నువ్వా నేనా? అంటూ పోరుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇంత‌కీ ఏ సినిమా అంటే నితిన్ న‌టిస్తున్న‌ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం.

ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఏప్రిల్ లో వేస‌వి కానుక‌గా విడుద‌ల కానుంది. ఏప్రిల్ 29న సినిమా విడుద‌ల‌వుతుంది. అయితే త‌న సినిమాని కూడా అదే రోజు రిలీజ్ చేస్తాన‌ని హీరో నితిన్ ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. యూత్ స్టార్ నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం అన్ని ప‌నుల్ని పూర్తి చేసుకుని అప్ప‌టికి రిలీజ‌వుతుంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మల్లు చిత్రంలో నిధి అగ‌ర్వాల్ - జాక్విలిన్ ఫెర్నాండెజ్ క‌థానాయిక‌లు. ఏ.ఎం.ర‌త్నం నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికి 60శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. పెండింగ్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌నున్నారు. నితిన్ న‌టిస్తున్న మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం చిత్రానికి ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌. సుధాకర్‌ రెడ్డి- నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ప‌వ‌న్ కి నితిన్ వీరాభిమాని అయినా మొద‌టి సారి ఇలా పోటీప‌డుతున్నాడు. అందుకే ప‌వ‌ర్ స్టార్ వ‌ర్సెస్ యూత్ స్టార్ బాక్సాఫీస్ వార్ ఇప్ప‌టికి హాట్ టాపిక్ గా మారింది.