Begin typing your search above and press return to search.

వీర‌మ‌ల్లు 40 శాత‌మే! పెండింగ్ ఆ పెరుమాళ్ల‌పైనే!

By:  Tupaki Desk   |   16 Dec 2022 7:35 AM GMT
వీర‌మ‌ల్లు 40 శాత‌మే! పెండింగ్ ఆ పెరుమాళ్ల‌పైనే!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' వ‌చ్చే ఏడాది ప‌క్కాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తుంద‌ని గ‌ట్టిగానే ప్ర‌చారం సాగుతుంది. మ‌రి ఆ ప్ర‌చారాన్ని ప‌వ‌న్ నిజం చేస్తాడా? లేదా? అన్న‌ది మాత్రం ఆ పెరుమాళ్ల‌కే తెలియాలి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మై రెండున్న‌రేళ్లు అవుతుంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ క‌నీసం షూటింగ్ కూడా పూర్తి చేయ‌లేదు.

ప‌వ‌న్ పొలిటిక‌ల్ బిజీ నేప‌థ్యంలో జాప్యం జ‌రుగుతోంది అన్న‌ది వాస్త‌వం. కానీ మ‌రి ఇంత‌లా డిలే అయ్యే స‌రికి విమ‌ర్శ‌లు వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సినిమా అప్ డేట్ ఏంటి? వీర‌మ‌ల్లు షూటింగ్ ఎంత శాతం పూర్త‌యింది? ఎంకెంత పెండింగ్ ఉంది? అది ఎప్ప‌టికీ పూర్త‌వుతుంది? వంటి సందేహాలు ఉత్ప‌న్నం అవుతోన్న‌ నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర సంగ‌తులే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం40 శాత‌మే పూర్త‌యిందిట‌. బ్యాలెన్స్ 60 శాతం పూర్తిచేయాల్సి ఉందిట‌. దీనికి ఏలా లేద‌న్నా ఆరు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు. అదీ ఇప్ప‌టి నుంచి ఏక‌ధాటిగా పీకే ఎలాంటి బ్రేక్ లు తీసుకోకుండా చేస్తేనే పూర్త‌వుందిట‌. లేదంటే? ఎప్పుడు పూర్త‌వుతుంద‌న్న‌ది ఆ పెరుమాళ్ల‌కే తెలియాల్సిన అంశంగా క‌నిపిస్తుంది.

క్రిష్ టార్గెట్ మాత్రం ఏప్రిల్ వ‌ర‌కూ పూర్తి చేయాల‌ని పెట్టుకున్నారుట‌. కానీ ఆ దేవుడు క‌రుణించాలి.అప్పుడే క్రిష్ అనుకున్న‌ట్లు జ‌రుగుతోంది. అయితే ఇలా డిలే జ‌ర‌గ‌డంతో క్రిష్ ఒకానొక స‌మ‌యంలో అసంతృప్తిని వ్య‌క్తం చేసారుట‌.

రెండు..మూడేళ్ల పాటు ఒకే సినిమాకి ప‌నిచేయ‌డం త‌న‌కి లాస్ ఆఫ్ పేగానే భావిస్తున్నారుట‌. ఎంత క‌ళాఖండం తీసిన ఇన్నేళ్ల పాటు ఏ డైరెక్ట‌ర్ హీరో కోసం వేచి చూస్తాడంటూ స‌న్నిహితుల వ‌ద్ద అన్నారుట‌.

క్రియేటివ్ మేక‌ర్ గా పేరున్న త‌న‌ప‌రిస్థితే ఇలా ఉంటే... హ‌రీష్ శంక‌ర్...సుజీత్ లు ఇంకెంత కాలం వెయిట్ చేయాలో అంటూ సోష‌ల్ మీడియాలో సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. 2024 ఎన్నిక‌లు త‌ర్వాతే ఆ ఇద్ద‌రి డైరెక్ట‌ర్ల సినిమాలు పూర్తి చేసేది అంటూ ఓ నెటిజ‌నుడు న‌వ్వేసాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.