Begin typing your search above and press return to search.

వీరమల్లు మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   24 March 2021 3:30 AM GMT
వీరమల్లు మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌
X
పవన్‌ కళ్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ ఇటీవలే పూర్తి అయిన విషయం తెల్సిందే. పవన్‌ కళ్యాణ్‌ ఫస్ట్‌ లుక్ మరియు వీడియో గ్లిమ్స్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దుగా పెరిగి పోయాయి అనడంలో సందేహం లేదు. అద్బుతంగా తీర్చి దిద్దిన సెట్టింగ్‌ ల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం వేసిన ఛార్మినార్‌ సెట్టింగ్ ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ మినహా ఇతర యూనిట్‌ సభ్యులతో ఛార్మినార్‌ సెట్టింగ్‌ వద్ద క్రిష్‌ షూటింగ్‌ నిర్వహిస్తున్నాడు. అతి త్వరలోనే పవన్‌ కూడా మళ్లీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 27వ తారీకు నుండి వారం పది రోజుల పాటు హరిహర వీరమల్లు సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా లోని కీలక యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు క్రిష్‌ సన్నాహాలు చేస్తున్నాడు. ముంబయి నుండి వంద మంది శిక్షణ పొందిన ఫైటర్స్‌ వచ్చారట. ఇప్పటికే వారితో షూటింగ్‌ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. పవన్‌ కళ్యాణ్‌ కూడా జాయిన్‌ అయ్యి వారితో తలపడబోతున్నాడు. దాదాపుగా 150 కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమా ను ఎఎం రత్నం నిర్మిస్తున్న విషయం తెల్సిందే. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తోంది. వచ్చే సంక్రాంతి సందర్బంగా 2022 జనవరిలో విడుదల చేయబోతున్నారు.