Begin typing your search above and press return to search.

వీరయ్యలో మాస్ రాజా కుమ్మేశాడు..!

By:  Tupaki Desk   |   13 Jan 2023 6:47 AM GMT
వీరయ్యలో మాస్ రాజా కుమ్మేశాడు..!
X
చిరంజీవి నటించిన సినిమాలో మరో హీరో అంటే కచ్చితంగా వెయిట్ చిరుకే ఎక్కువ ఉంటుంది. కథ డిమాండ్ ను బట్టి వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజని తీసుకున్నారు. పోలీస్ ఆఫీసర్ విక్రం గా రవితేజ కనిపించారు. ఈ సినిమాలో రవితేజ పాత్ర కూడా చిరుకి ఈక్వల్ గా అనిపిస్తుంది. ధమాకాతో సూపర్ హిట్ కొట్టిన జోష్ లో ఉన్న రవితేజ వాల్తేరు వీరయ్యలో కూడా అదరగొట్టేశాడు. తన పవర్ ఫుల్ పాత్రలో అంతే పవర్ ఫుల్ గా రవితేజ ది గ్రేట్ అనిపించుకున్నాడు. చిరంజీవి, రవితేజ బ్రదర్స్ గా మెప్పించారు.

రవితేజ ఊర మాస్ యాటిట్యూడ్ గురించి అందరికీ తెలిసిందే. వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా రవితేజ ఎంట్రీనే ఓ సూపర్ ఫైట్ తో ఇచ్చారు. ఇక అక్కడ నుంచి ఆయన పాత్ర ముగిసే వరకు సినిమా మంచి దూకుడు మీద ఉంటుంది. రవితేజ పాత్ర ఎండ్ అవ్వడం కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. వాల్తేరు వీరయ్యకు రవితేజ చాలా ప్లస్ అయ్యాడని చెప్పొచ్చు. మాస్ రాజాని బాబీ చూపించిన తీరు అదుర్స్.

సినిమాలో ఒకానొక దశలో చిరుని కూడా డామినేట్ చేసేలా రవితేజ పాత్ర ఉంటుంది. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రవితేజ మరోసారి కుమ్మేశాడు. తనదైన శైలిలో నటించి మెప్పించిన రవితేజ తన ఫ్యాన్స్ కి ధమాకా తో పాటుగా వాల్తేరు వీరయ్య సినిమాను గిఫ్ట్ గా ఇచ్చాడు.

ఓ పక్క వింటేజ్ చిరు, మరో పక్క మాస్ రాజా మాస్ జాతర ఈ రెండు హైలెట్ అయ్యి వాల్తేరు వీరయ్య సినిమాను మెగా మాస్ ట్రీట్ అందించింది.

చిరు తో అన్నయ్య సినిమాలో తమ్ముడిగా స్క్రీన్ షేర్ చేసుకున్న రవితేజ ఈసారి చిరుతో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించాడు. ఈ మాస్ ట్రీట్ మెగా ఫ్యాన్స్ కే కాదు సాధారణ ఆడియన్స్ ని కూడా అదుర్స్ అనిపించేలా చేస్తుంది.

పొంగల్ రేసులో పోటీగా సినిమాలు ఉన్నా ఈ మెగా మాస్ కాంబో ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకునేలా ఉంది. మెగా మార్క్ మాస్ మూవీగా వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ పై ఏ రేంజ్ లో విజృంభణ చూపిస్తాడో కలెక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.