Begin typing your search above and press return to search.

చుట్టాల‌బ్బాయ్ భ‌ద్ర‌మేనా భాయ్‌?

By:  Tupaki Desk   |   23 Dec 2015 6:15 AM GMT
చుట్టాల‌బ్బాయ్ భ‌ద్ర‌మేనా భాయ్‌?
X
వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి.. ఈ పేరు ఉన్న‌ట్టుండి తెర‌మ‌రుగైంది. స్టార్ హీరో నాగార్జున‌తో భాయ్ ఎటెంప్ట్ ఫెయిల‌వ్వ‌డంతో ఒక్క‌సారిగా భ‌ద్ర‌మ్‌ కి జోల్ట్ త‌గిలింది. నాటి నుంచి డైరెక్ట‌ర్‌ భ‌ద్ర‌మ్ ఎక్క‌డ‌? అన్న డిష్క‌స‌న్ ఫిలింస‌ర్కిల్స్‌ లో సాగుతూనే ఉంది. అత‌డు వ‌స్తాడు. మ‌ళ్లీ వ‌స్తాడు. ఈసారి హిట్టు సినిమా తీస్తాడు అన్న న‌మ్మ‌కం కొంద‌రిలో వ్య‌క్త‌మైంది. అల్లరి న‌రేష్ హీరోగా అహ‌నా పెళ్లంట‌, సునీల్ హీరోగా పూల రంగ‌డు వంటి చ‌క్క‌ని విజ‌య‌వంత‌మైన సినిమాలు తీసిన వీర‌భ‌ద్ర‌మ్ భాయ్ విష‌యంలో పొర‌పాటు ప‌డ్డాడు. ఇప్పుడు ఆ పొర‌పాటును స‌వ‌రించుకుని కెరీర్‌ కి జ‌రిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునే ప‌నిలో ప‌డ్డాడు. త‌న‌కి తోచిన జోన‌ర్‌ లోనే ఆది హీరోగా చుట్టాల‌బ్బాయ్ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా విష‌యంలో ఆది చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు. చుట్టాల‌బ్బాయ్ విష‌యంలో ప‌క్కా కాన్ఫిడెంట్‌ గా ఉన్నా. హిలేరియ‌స్ కామెడీ మూవీ ఇది. నాకు, వీర‌భ‌ద్ర‌మ్‌ కి మ‌రో హిట్ ఖాయం అంటూ వ్యాఖ్యానించి హీరో ఆది భ‌ద్ర‌మ్ భాయ్‌ కి ఊపిరిలూదాడు. ఆది మాట్లాడుతున్న తీరు చూస్తుంటే భ‌ద్ర‌మ్ జ‌ర భ‌ద్ర‌మ్‌ గానే ఉన్నాడ‌న్న సంగ‌తి అర్థ‌మ‌వుతోంది. ఒక‌వేళ చుట్టాలబ్బాయ్ హిట్టెక్కితే పోయిన ఫేమ్ తిరిగొస్తుంది. అక్క‌డి నుంచి వ‌చ్చిన ఫేమ్‌ ని నిల‌బెట్టుకునేందుకు మ‌ళ్లీ మ‌ళ్లీ హిట్ సినిమాలే తీయాల్సి ఉంటుంది. కాబ‌ట్టి భ‌ద్ర‌మ్ భాయ్ ఇప్ప‌ట్నుంచే జాగ్ర‌త్త‌లు తీసుకుని ముందు హిట్టు కొట్టు. అటుపై హిట్టు సినిమాల క‌థ‌లు రాసుకుని ప‌క్కాగా అడుగెయ్‌. జ‌ర భ‌ద్ర‌మ్ మ‌రి!