Begin typing your search above and press return to search.

భద్రమ్‌.. ఫోన్‌ లిఫ్ట్‌ చెయ్యకుండా...

By:  Tupaki Desk   |   11 Jun 2015 3:47 PM IST
భద్రమ్‌.. ఫోన్‌ లిఫ్ట్‌ చెయ్యకుండా...
X
వీరభద్రమ్‌ చౌదరి అలియాస్‌ భద్రమ్‌ .. ఇటీవలి కాలంలో హైడ్‌ అండ్‌ సీక్‌ గేమ్‌ ఆడుతున్నాడు. క్షణం తీరిక లేని బిజీ అని అనాలో, లేక ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ కనిపించకుండా తాను ఆశించిన ఆ ఒక్క హిట్టు వచ్చే వరకూ ఎవరికీ చిక్కకూడదని అనుకున్నాడో ఏమో, ఏకంగా ఫోన్‌ని స్విచ్ఛాఫ్‌ చేశాడు. పాత నంబర్లన్నీ మార్చేశాడు. ఒకవేళ కొత్త నంబర్‌ ఏదోలా తెలుసుకుని ఫోన్‌ చేయాలని చూసినా అస్సలు కనెక్టే కాలేదు.

భద్రమ్‌ కనీసం తెలిసిన వారి కాల్స్‌ కూడా ఎత్తకుండా పూర్తి ఏకాగ్రతతో స్క్రిప్ట్‌ వర్క్‌ చేసుకుంటున్నాడట. అందుకే ఫోన్లన్నీ ఇలా పక్కనెట్టేశాడని ఈరోజు కొందరు మీడియా మిత్రులతో చెప్పుకొచ్చాడు. ఒక భారీ పరాజయం తర్వాత ఇప్పుడు తిరిగి కెరీర్‌ని నిర్మించుకోవాలంటే ఇలా కష్టపడక తప్పదేమో. మనోడు ''భాయ్‌'' సినిమా తీసి నాగార్జున అంతటి స్టార్‌ చేత మాట పడాల్సొచ్చింది. ఈ సినిమా చేసి తప్పు చేశానని స్వయంగా కింగ్‌ నాగ్‌ చెప్పాడంటే.. అసలు ఒక డైరక్టర్‌గా భద్రమ్‌ ఏ ఏంజ్‌లో ఫెయిల్‌ అయ్యాడో మనం ఊహించుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఆదితో సక్సెస్‌ కొట్టి దానికి సమాధానం చెప్పాల్సి ఉంది.