Begin typing your search above and press return to search.

వీరభద్రం చుట్టాలబ్బాయిని తీసుకొస్తున్నాడు

By:  Tupaki Desk   |   11 Jun 2015 7:51 AM GMT
వీరభద్రం చుట్టాలబ్బాయిని తీసుకొస్తున్నాడు
X
వీరభద్రం చౌదరి.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనిపిస్తుంది కదూ. ఇవివి సత్యనారాయణ, తేజ లాంటి దర్శకులతో పనిచేసి 2011లో అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆహా నా పెళ్ళంట సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ పెళ్లి బాజాలు బాక్సాఫీస్ వద్ద బాగానే మోగి మంచి కలెక్షన్లను రాబట్టుకున్నాయి. ద్వీతీయ విఘ్నం కలగకుండా సునీల్ ని పూలరంగడు గా చూపించి తనతో పాటు సునీల్ కి విజయంలో వాటా ఇచ్చాడు.

ఇలా వరుస రెండు విజయాలిచ్చిన సంగతి కింగ్ నాగార్జునకి తెలిసి భాయ్ అని చెయ్యేశారు. అంతే రెండేళ్ళు ఎవరికీ కనపడలేదు వీరభద్రం. ఇప్పుడిప్పుడే చుట్టాలబ్బాయితో కాస్త ధైర్యం కూడా దీసుకుని రావడానికి సిద్ధమవుతున్నాడు. ఐశ్వర్య లక్ష్మి ఫిలింస్ పతాకంపై వెంకట్ తలారి నిర్మిస్తున్న చిత్రం చుట్టాలబ్బాయ్. ఆది హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నేడు ప్రారంభమయింది. చుట్టాలబ్బాయ్ సాయంతో వీరభద్రం విజయాల బాట పడతాడేమో చూద్దాం.