Begin typing your search above and press return to search.

కోలుకున్న చౌదరి రూటు మార్చేశాడు..

By:  Tupaki Desk   |   1 April 2017 4:34 AM GMT
కోలుకున్న చౌదరి రూటు మార్చేశాడు..
X
అహా నా పెళ్ళంట అనే సినిమాతో డైరక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు వీరభద్రమ్. ఆ తరువాత నాగార్జున తో భాయ్ అనే సినిమా తీశాడు. ఆ సినిమా డిజాష్టర్ తరువాత చాన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళిపోయిన ఈ దర్శకుడు.. తరువాత పేరు చివరను చౌదరి అని తగిలించుకుని.. ఆది తో ''చంటబ్బాయ్'' సినిమా తీశాడు. రీసెంటుగా రిలీజైన ఈ సినిమా ఎ'సెంటర్లలో ఫ్లాపే కాని.. బి అండ్ సి లో మాత్రం వసూళ్ళను బాగానే రాబట్టింది.

అయితే ఈ సినిమా తరువాత మరి భద్రంగా ఎటువంటి ప్రాజెక్టు చేయాలా అని చాలా ఆలోచించుకుని.. మనోడు ఫైనల్ గా ఒక సినిమాను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈయనతో పనిచేయాలని ఎప్పటినుండో ఆసక్తి చూపిస్తున్న ఒక ప్రొడ్యూసర్ దొరకడంతో.. ఇప్పుడు ఒక థ్రిల్లర్ సినిమా తీయడానికి సెట్టింగ్ రెడీ చేసుకుంటున్నాడు వీరభద్రమ్ చౌదరి. తన గత సినిమాలన్నీ కామెడీని బేస్ చేసుకుని ఉంటే.. ఈ సినిమా మాత్రం పూర్తి స్థాయి సస్పెన్స్ డ్రామా అని చెబుతున్నాడు.

ఈ సినిమాలో హీరో ఎవరనేది ఇంకా తెలియదు కాని.. వీరభద్రమ్ మాత్రం ఒక హ్యాపెనింగ్ యంగ్ హీరోతో చేయాలని వెయిట్ చేస్తున్నట్లు టాక్. ఏదేమైనా కూడా చాలామంది అనుభవం ఉన్న దర్శకులు.. ఫ్లాపులు కొట్టకుండా హిట్లు కొడితే.. సినిమా ఇండస్ర్టీ కలకాలం కళకళలాడుతుంటంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/