Begin typing your search above and press return to search.

వేదిక‌.. బోయ్స్ ని ఊహ‌ల ఊయ‌‌ల్లో ఊసేస్తోంది

By:  Tupaki Desk   |   26 Nov 2020 12:10 PM GMT
వేదిక‌.. బోయ్స్ ని ఊహ‌ల ఊయ‌‌ల్లో ఊసేస్తోంది
X
`బాణం` ఫేం వేదిక గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నారా రోహిత్ స‌ర‌స‌న న‌టించిన ఈ బ్యూటీ అటుపై బాల‌య్య బాబు స‌ర‌స‌నా అవ‌కాశం అందుకుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చెప్పుకోద‌గ్గ అవ‌కాశాల్లేవ్. ఇటీవ‌ల ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ వేదిక అవ‌కాశాల వేట సాగిస్తోంది.

ఆ క్ర‌మంలోనే వ‌ర‌స ఫోటోషూట్ల‌తో వేదిక ఇన్ స్టా వేదిక‌గా ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటోంది. సాటి నాయిక‌ల‌కు ఏమాత్రం తీసిపోని రేంజులో హీటెక్కించే ఫోటోషూట్ల‌తో అమ్మ‌డు అగ్గి రాజేస్తోంది. ఇటీవ‌ల పూల్ సైడ్ ట్రీట్ తో మంట‌లు పెట్టింది. అటుపై మాల్దీవుల్లో బికినీ బీచ్ విహారానికి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసింది.

తాజాగా నెట్ డ్ డిజైన‌ర్ డ్రెస్ ధ‌రించి ఊయ‌ల‌లూగుతున్న ఫోటోని షేర్ చేసింది వేదిక‌. ఓపెన్ రిసార్ట్ ఫోటోషూట్ ఒక్క‌సారిగా వైర‌ల్ గా మారింది. ముఖ్యంగా ఆ నెట్ డ్రెస్ లో వేదిక థై సొగ‌సులు ఆర‌బోసిన తీరుకు బోయ్స్ కంటికి కునుకుప‌ట్టడం క‌ష్ట‌మే. ఉన్న‌ట్టుండి ఈ ట్రెడిష‌న‌ల్ బ్యూటీ త‌న‌లోని రెండో యాంగిల్ ని బ‌య‌ట‌పెట్టి ట్రీటిస్తుండ‌డంతో ఇన్ స్టాలో సామాజిక మాధ్య‌మాల్లో ఈ ఫోటోలు జోరుగా వైర‌ల్ అయిపోతున్నాయి.

లారెన్స్ కాంచ‌న 3లో చివ‌రిసారిగా క‌నిపించిన వేదిక ప్ర‌స్తుతం నాలుగైదు చిత్రాల్లో న‌టిస్తోంది. హోమ్ మినిస్ట‌ర్ .. జంగిల్.. వినోద‌న్ అనే చిత్రాల్లో న‌టిస్తోంది. లాక్ డౌన్ వ‌ల్ల చిత్రీక‌ర‌ణ‌లు వాయిదా ప‌డగా తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. హోమ్ మినిస్ట‌ర్ నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి.
Tags: