Begin typing your search above and press return to search.

సన్నీ కోసం వేదం పెద్దాయన చిందులు

By:  Tupaki Desk   |   5 Oct 2017 12:18 PM GMT
సన్నీ కోసం వేదం పెద్దాయన చిందులు
X
క్రిష్ దర్శకత్వంలో రూపొందిన వేదం చిత్రం చూసిన వారెవరూ.. ఆ మూవీలో ఏ కేరక్టర్ ను మర్చిపోలేరు. ముఖ్యంగా కిడ్నీ అమ్ముకునే పాత్రలో నటించిన నాగయ్య.. వేదం నాగయ్యగా మారిపోయాడు. అయితే.. ఆ తర్వాత కూడా ఇలాంటి ట్రాజెడీ.. సీరియస్ పాత్రలే నాగయ్యకు దక్కాయి. కానీ మొదటిసారిగా ఈ పెద్దాయనను డిఫరెంట్ యాంగిల్ లో చూపించాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు.

రాజశేఖర్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ పీఎస్వీ గరుడవేగ కోసం రీసెంట్ గా ఓ టీజర్ లాంఛ్ చేశారు. ఇది వేదం నాగయ్యపై రూపొందించిన టీజర్ కావడమే ఇక్కడ విశేషం. వేదం నాగయ్య ముంబైలో దిగాడు అంటూ మొదలుపెట్టి.. సన్నీ లియోన్ తో పాట పాడ్డానికి.. డ్యాన్సులు చేయడానికి అంటూ అసలు విషయం రివీల్ చేశారు. నాగయ్యపై పిక్చరైజ్ చేసిన కొన్ని సీన్స్ కు సంబంధించిన షాట్స్ ను కూడా టీజర్ లో పొందుపరిచారు. నీకోసం సచ్చిపోతానే అంటూ సన్నీ లియోన్ తో వేదం నాగయ్య వేసిన చిందులు ఆడియన్స్ ను బాగానే అలరించడం ఖాయం.

అయితే.. ఈ టీజర్ లో కూడా సన్నీ లియోన్ ను చూపించలేదు కానీ.. రీసెంట్ టైంలో ఐటెం సాంగ్స్ లో ఇదో ట్రెండ్ అయిపోతుందనే అంచనాలను క్రియేట్ చేయడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సన్నీ లియోన్ ఐటెం సాంగ్ ను.. అప్పట్లో సిల్క్ స్మిత నటించిన బావలు సయ్యా స్థాయిలో సక్సెస్ చేయాలన్నది ప్రవీణ్ సత్తారు ఆలోచన.