Begin typing your search above and press return to search.

చిరు చెల్లెలి పాత్రలో ఎవరు నటిస్తున్నారు..?

By:  Tupaki Desk   |   16 Oct 2020 12:30 PM GMT
చిరు చెల్లెలి పాత్రలో ఎవరు నటిస్తున్నారు..?
X
మెగాస్టార్ చిరంజీవి - మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది తమిళ్ 'వేదలమ్' సినిమాకి రీమేక్ గా రానుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ - శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందని భావించి ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కథలో కీలకమైన సిస్టర్ రోల్ లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తమిళ్ లో హీరో చెల్లెలి పాత్రలో హీరోయిన్ లక్ష్మీ మీనన్ అద్భుతంగా నటించింది. తెలుగు రీమేక్ లో ఆ పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి చిరుకి చెల్లిగా కనిపించనుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆ క్యారక్టర్ కోసం మరో పేరు తెరపైకి వచ్చింది.

'మహానటి' కీర్తి సురేష్ ని 'వేదలమ్' తెలుగు రీమేక్ లో నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. సినిమాలో నటనకు స్కోప్ ఉండటంతో పాటు పూర్తి స్థాయిలో ఉండనున్న హీరో సిస్టర్ పాత్రలో కీర్తి సురేష్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మేకర్స్ ఈ పాత్ర కోసం ఇంకా ఎవరిని ఫైనలైజ్ చేయలేదని తెలుస్తోంది. కీలకమైన హీరో సోదరి పాత్రకి ప్రముఖ నటి అవసరం ఉన్నప్పటికీ సాయి పల్లవి లేదా కీర్తి సురేష్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో యంగ్ బ్యూటీస్ లో ఎవరు మెగా రీమేక్ కి డేట్స్ కేటాయిస్తారో చూడాలి. ఈ ప్రాజెక్ట్ ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన అక్టోబర్ లోనే ఉంటుందని సమాచారం.