Begin typing your search above and press return to search.

దేశభక్తిని చాటిచెప్పే పాత్రలపై మక్కువ చూపిస్తున్న VD..!

By:  Tupaki Desk   |   20 April 2022 9:30 AM GMT
దేశభక్తిని చాటిచెప్పే పాత్రలపై మక్కువ చూపిస్తున్న VD..!
X
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే పాన్ ఇండియా స్పోర్ట్స్ ఫిలిం షూటింగ్ పూర్తి చేశాడు. ఇందులో వీడీ బాక్సర్ గా కనిపించనున్నారు. స్లమ్ నుంచి వచ్చిన ఓ యువకుడు ప్రపంచ స్థాయి బాక్సర్ గా ఎలా ఎదిగాడు? దేశానికి ఎలాంటి గుర్తింపు తెచ్చాడు? అనే కథాంశంతో తెరకెక్కుతోంది.

'లైగర్' సినిమా రిలీజ్ అవ్వకుండానే పూరీతో కలిసి 'JGM' (జనగణమన) అనే మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇందులో దేవరకొండ విజయ్ ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా పట్టాలెక్కించారు. ఈ క్రమంలో శివ నిర్వాణ దర్శకత్వంలో వీడీ ఓ మూవీ స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

శివ నిర్వాణతో విజయ్ ప్రాజెక్ట్ గురించి చాలా కాలం క్రితమే వార్తలు వచ్చాయి. అయితే అది ఇప్పుడు కార్యరూపం దాల్చబోతోందని అంటున్నారు. ఇందులో సమంత హీరోయిన్ గా నటించనుంది. గతంలో వీరిద్దరూ 'మహానటి' సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే.

విజయ్ - సామ్ కలయికలో రాబోతున్న ఈ చిత్రానికి 'ఖుషి' అనే టైటిల్ ను అనుకుంటున్నారట. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం కశ్మీర్ లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదొక బ్యూటీఫుల్ లవ్ స్టోరీ అని.. ఇందులో VD ఒక ఆర్మీ మ్యాన్ గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

విజయ్ దేవరకొండ లైనప్ ను ఒకసారి గమనిస్తే.. వరుసగా దేశభక్తిని చాటిచెప్పే పాత్రలను ఎంచుకున్నట్టు అర్థం అవుతుంది. త్వరలో సుకుమార్ తో చేయబోయే సినిమా నేపథ్యం కూడా ఇలానే ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాక్సింగ్ సినిమా 'లైగర్' ను పక్కనపెడితే.. తెలుగులో ఆర్మీ పాత్రలు పెద్దగా విజయం సాధించలేదనే అనుకోవాలి.

అంతేకాదు ఆర్మీ ఆఫీసర్ పాత్ర కాబట్టి గెటప్‌ సేమ్ ఉంటుంది. లుక్ విషయంలో కూడా పెద్దగా ఏమీ చేయలేము. అయితే సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ గతంలో తెరకెక్కించిన ప్రేమ కథలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కూడా తప్పకుండా అలరిస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి దర్శకుడు సారూప్యత లేకుండా విజయ్ ను కొత్త తరహాలో ఎలా చూపిస్తాడో చూడాలి.