Begin typing your search above and press return to search.
డబూ రత్నాని కాలెండర్ లోకి ఫస్ట్ సౌత్ హీరో.. స్టన్నింగ్ లుక్ లో 'బీస్ట్ బాయ్' VD..!
By: Tupaki Desk | 14 Jun 2021 6:06 PM ISTటాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతోనే కాకుండా తన యాటిట్యూట్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సౌత్ క్రేజీ హీరోగా మారిపోయిన విజయ్.. ఇప్పుడు 'లైగర్' మూవీతో నార్త్ లో అడుగుపెడుతున్నాడు. యూత్ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న VD.. హైదరాబాద్ టైమ్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020' జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఇప్పటికే రెండుసార్లు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా నిలిచిన విజయ్.. వరుసగా మూడోసారి టైటిల్ సాధించి హిస్టరీ క్రియేట్ చేశాడు.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎంతోమంది ఫ్యాన్స్ ను సంబంధించిన విజయ్ దేవరకొండ.. ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్-2021 లో చోటు సంపాదించాడు. డబూ రత్నాని ప్రతీ ఏడాది ప్రముఖ స్టార్ హీరోహీరోయిన్లతో 'డబూ రత్నాని కాలెండర్' షూట్ నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం క్యాలెండర్ లో బాలీవుడ్ స్టార్ ల సరసన విజయ్ స్థానం సంపాదించారు. సౌత్ ఇండియా నుండి ఈ క్యాలెండర్ లో చోటు దక్కించుకున్న మొదటి హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం. 9 సినిమాలతోనే వీడీ ఇలాంటి నేషనల్ క్రేజ్ సంపాదించడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోను యంగ్ హీరో సోషల్ మీడియా మధ్యమాలలో షేర్ చేశాడు.
డబూ రత్నాని క్లిక్ చేసిన ఈ ఫొటోలో విజయ్ దేవరకొండ ఓ బైక్ పై స్టైల్ గా కూర్చొని ఉన్నాడు. బైసెప్స్ చూపిస్తూ.. 'లైగర్' హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నాడు. రగ్గ్ డ్ అండ్ స్టైలిష్ లుక్ లో విజయ్ సెక్సీగా ఉన్నాడు. దీనికి విజయ్ 'బీస్ట్ బాయ్' అనే క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలలో వైరల్ అవుతోంది. అంతకుముందు విజయ్ తో దిగిన ఓ సెల్ఫీ ని డబూ రత్నాని అభిమానులతో పంచుకున్నారు. అలానే ఇన్స్టాగ్రామ్ లైవ్ లో VD తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డబూ రత్నాని మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ తన క్యాలెండర్ లో ‘మెగా అరంగేట్రం’ చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు అతని స్టిల్ ‘అసాధారణమైనవి’ అని ఏస్ ఫోటోగ్రాఫర్ సంబోధించారు. ''నా క్యాలెండర్ లో డెబ్యూ చేసినందుకు థాంక్యూ. మీరు చాలా కూల్ పర్సన్. ఈ ఫొటో షూట్ చేసినపుడు చాలా ఎంజాయ్ చేసాను. నా క్యాలెండర్ లో కనిపించిన ఫస్ట్ సౌత్ యాక్టర్ మీరు. నేను షూట్ చేసిన బెస్ట్ డెబ్యూ ఫొటోషూట్ మీదే’’ అని డబూ అన్నారు.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ''డబూ రత్నాని క్యాలెండర్ లో కొన్నేళ్ల నుండి నాకు నచ్చిన ఎంతో మంది స్టార్స్ కనిపించారు. షారుఖ్ ఖాన్ సార్ ను చూసి మనకెప్పుడు ఇలాంటి అవకాశం వస్తుందా అనుకునేవాడిని. ఫైనల్ గా ఛాన్స్ దొరికినందుకు హ్యాపీగా ఉంది'' అన్నారు. అంతేకాదు 'లైగర్' లుక్ బయటకు రివీల్ అవుతుందని ముందు కాస్త ఆలోచించానని.. కానీ చివరకు డబూ రత్నాని షూట్ కు ఓకే చెప్పానని వీడీ తెలిపారు.
ఇకపోతే విజయ్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరీ - చార్మీ - కరణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు తమిళం కన్నడ మాలయాళ బాషాల్లో విడుదల కానుంది. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో యువ హీరో బాక్సర్ గా కనిపించనున్నాడు. దీని కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.