Begin typing your search above and press return to search.

దేవసేనకు జెరాక్స్‌ లా ఉందే పిల్ల...

By:  Tupaki Desk   |   13 Aug 2015 9:26 AM GMT


ఆల్‌ టైమ్‌ ఇండియన్‌ టాప్‌ ఫిలిం బాహుబలి. ఇందులో అవంతిక పాత్రలో నటించింది తమన్నా. ఈ పాత్రలో విరోచిత పోరాటాలు చేసి ఆకట్టుకుంది. కాస్త డీగ్లామరస్‌ పాత్ర అయినా అందరినీ మెప్పించింది. బాహుబలి పార్ట్‌ 2లోనూ అవంతిక పాత్ర ఉంటుంది. ఇందులో శివుడితో ప్రేమాయణం మరోసారి చూపించనున్నారు. అయితే బాహుబలి రెండో భాగం రిలీజవ్వడానికి ఇంకా చాలా టైమ్‌ ఉంది. ఈలోగానే ఈ అమ్మడు నటించిన తమిళ సినిమా రిలీజ్‌ కి వస్తోంది.

వాసువుమ్‌ సెరవనుమ్‌ వొన్న పడిచవంగ .. అనేది సినిమా టైటిల్‌. ఆర్య హీరోగా నటించాడు. నా రొంబ బిజీ అనే పాటను ఆన్‌ లైన్‌ లో రిలీజ్‌ చేశారు. ఈ పాటలో తమన్నా గెటప్‌ ప్రస్తుతం ఫిలింనగర్‌ లో హాట్‌ టాపిక్‌. అచ్చు దేవసేన గెటప్‌లో కనిపించి షాకిచ్చింది తమ్మూ. మెడలో హారం, పింకు చీర, నడుముకు వడ్డానం, నెత్తిన కిరీటం ఇవన్నీ చూస్తుంటే తమ్మూ అచ్చం దేవసేనలా కనిపిస్తోంది.

ఇలా ఉద్ధేశ పూర్వకంగానే ఇమ్మిటేట్‌ చేసిందా? లేక అది కథలో, పాట కాన్సెప్టు లో భాగంగానే వచ్చిందా? అన్న డిష్కసన్‌ పరిశ్రమ వర్గాల్లో మొదలైంది. బాహుబలి 2లో దేవసేన అసలు గెటప్‌ ఇలానే ఉంటుంది మరి. ఇప్పటికే పోస్టర్‌ చూసినవారు ఈ సంగతిని ఇట్టే చెప్పేస్తారు. మిల్కీ సడెన్‌ గా ఈ గెటప్‌ తో సర్‌ ప్రైజ్‌ ఇచ్చింది అందరికీ.