Begin typing your search above and press return to search.

పవన్ సినిమాకు అతగాడి హెల్పింగా??

By:  Tupaki Desk   |   3 Oct 2016 4:55 AM GMT
పవన్ సినిమాకు అతగాడి హెల్పింగా??
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభం కావడమే కాదు.. కాటమరాయుడు యూనిట్ తో పవన్ కూడా జతైపోయిన సంగతి ముందే తెలుసు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ని అక్టోబర్ 5 నుంచి తమిళనాడులోని రామేశ్వరంలో ఫిక్స్ చేశారు. మూవీలో ఎక్కువగా వచ్చే టెంపుల్ సీన్స్ ను ఇక్కడే షూట్ చేయాలని దర్శకుడు డాలీ ఫైనల్ చేశాడు. అయితే.. కాటమరాయుడుకు దిల్ రాజు క్యాంప్ లోని దర్శకుడు వాసు వర్మ హెల్ప్ చేస్తున్నాడని తెలుస్తోంది.

అక్కినేని నాగచైతన్య మొదటి మూవీ జోష్ తో పాటు.. రీసెంట్ గా సునీల్ తో కృష్ణాష్టమి తీసిన దర్శకుడే ఈ వాసు వర్మ. ఈయనపై దిల్ రాజుకు ఎనలేని నమ్మకం. తన సినిమాలను సక్సెస్ చేయలేకపోయినా.. పలు భారీ బడ్జెట్ చిత్రాలకు కూడా క్రియేటివ్ ఇన్ పుట్స్ ఇచ్చిన అనుభవం వాసు వర్మకు బాగానే ఉంది. ఇప్పుడు స్క్రిప్ట్ డెవలప్ మెంట్ దగ్గర నుంచి.. లొకేషన్ లో ఫెసిలిటీస్ వరకూ.. వాసు వర్మ హ్యాండ్ ఉందని అంటున్నారు. ముఖ్యంగా స్పాట్ డెవలప్మెంట్స్ విషయంలో డాలీ-వాసు వర్మలు కలిసి పని చేస్తుండడం విశేషం. మనోడు స్ర్కీన్ ప్లే విషయంలో భారీగానే హెల్పింగ్ చేస్తున్నాడట.

ఓ ట్యాలెంటెడ్ డైరెక్టర్ డాలీ దర్శకత్వంలో.. మరో ట్యాలెండెట్ దర్శకుడు వాసు వర్మ సలహాలతో.. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీ అభిమానులతో అరుపులు-కేకలు పెట్టించే రేంజ్ లో రెడీ అవుతోందని ఇన్ సైడ్ వర్గాల టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/