Begin typing your search above and press return to search.

షాకిచ్చిస్తున్న కల్యాణ్ రామ్ డైరెక్ట‌ర్‌!

By:  Tupaki Desk   |   20 Oct 2022 6:32 PM IST
షాకిచ్చిస్తున్న కల్యాణ్ రామ్ డైరెక్ట‌ర్‌!
X
ఈ ఏడాది జూన్, జూలై నెల్లో విడుద‌లైన సినిమాల్లో అత్య‌ధిక శాతం బ్యాక్ టు బ్యాక్ డిజాస్ట‌ర్ లు, ఫ్లాప్ లే వుండ‌టంతో టాలీవుడ్ వ‌ర్గాల్లో కల‌వ‌రం మొద‌లైంది. ఇక సినిమాల‌ని ప్రేక్ష‌కులు ఆద‌రించారా? ఓటీటీల‌కు థీయేట‌ర్ల‌కు రావ‌డం ఇక క‌ష్ట‌మేనా? అని భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్న వేళ ఆగ‌స్టు 5న విడేద‌లై `బింబిసార‌` అఖండ విజ‌యాన్ని అందించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా సాధించిన విజ‌యంతో టాలీవుడ్ కు స‌రికొత్త ఊపొచ్చింది. మంచి కంటెంట్ తో సినిమాలు చేస్తే ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌నే ధైర్య‌మొచ్చింది.

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ డ్యుయెల్ రోల్ లో న‌టించిన‌ ఈ పీరియాడిక్ టైమ్ ట్రావెల్ ఫిక్ష‌న్ డ్రామాతో వ‌శిష్ట ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. తొలి సినిమాతో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకుని ఇండ‌స్ట్రీ వర్గాల చేత శ‌భాష్ అనిపించుకున్నాడు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సైతం ద‌ర్శ‌కుడు వ‌శిష్ట టేకింగ్‌, మేకింగ్ ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో వ‌శిష్ట టాలీవుడ్ లో హాట్ ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ల జాబితాలో చేరిపోయాడు.

`బింబిసార‌` త‌రువాత ఈ మూవీకి సీక్వెల్ ని చేయ‌బోతున్నామంటూ హీరో నంద‌మూరి కల్యాణ్ రామ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే యంగ్ డైరెక్ట‌ర్ మ‌ల్లిడి వ‌శిష్ట తాజాగా అంద‌రికి షాకిస్తూ త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కు క‌థ చెప్పిన‌ట్టుగా ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇటీవ‌ల చెన్నై వెళ్లిన మ‌ల్లిడి వ‌శిష్ట సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ని క‌లిశార‌ట‌. క‌ల‌వ‌డ‌మే కాకుండా ఆయ‌న‌కు క‌థ వినిపించార‌ట‌.

ర‌జ‌నీ కూడా క‌థ విని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని చెబుతున్నారు. ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం `బీస్ట్` డైరెక్ట‌ర్ నెల్సన్‌దిలీప్ కుమార్ డైరెక్ష‌న్ లో స‌న్ పిక్చ‌ర్స్ వారు నిర్మిస్తున్న `జైల‌ర్‌` మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇది పూర్త‌య్యాక మ‌ల్లిడి వ‌శిష్ట సినిమా గురించి ఆలోచిస్తార‌ట‌. త‌ను కూడా నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ తో `బింబిసార 2` ని పూర్తి చేయాలి. ఆ త‌రువాతే ర‌జ‌నీ ప్రాజెక్ట్ కు వెళ్లే అవ‌కాశం వుంది.

అన్నీ అనుకున్న‌ట్టుగా కుదిరితే ర‌జ‌నీ మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌పైకి తీసుకొచ్చే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నారు. ప్రస్తుతం మ‌ల్లిడి వ‌శిష్ట `బింబిసార 2` స్క్రీప్ట్ వ‌ర్క్ లో వున్నాడ‌ట‌. క‌ల్యాణ్ రామ్ ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా వున్నాడు. ఆ రెండు పూర్త‌యిన వెంట‌నే `బింబిసార 2` ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌బోతున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.