Begin typing your search above and press return to search.
పవన్ కారణంగా ట్రెండింగ్ అవుతున్న తమిళ్ సాంగ్...!
By: Tupaki Desk | 5 Sept 2020 4:40 PM ISTజనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. తనకి బర్త్ డే విషెస్ చెప్పిన వాళ్లందరికీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. సినీ రాజకీయ ఇతర రంగాలకు చెందిన ప్రతి ఒక్కరికి ట్విట్టర్ లో రిప్లై ఇచ్చాడు. అయితే ఏదో విషెస్ చెప్పారు మనం థ్యాంక్స్ చెపుదాం అని కాకుండా ప్రతి ఒక్కరికి ఆత్మీయంగా మెసేజ్ పెడుతూ.. వారి ప్రత్యేకతను గుర్తు చేస్తూ వాళ్ల ప్రతిభను కొనియాడారు. ఈ సందర్భంగా పవన్ ఓ తమిళ్ సాంగ్ అంటే ఇష్టమని చెప్పడంతో.. ఆ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
కాగా పవన్ కల్యాణ్ కు కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ బర్త్ డే విషెస్ అందించారు. దీనికి పవన్ బదులిస్తూ.. ''డియర్ తిరు శివ కార్తికేయన్.. మీ ఆత్మీయ శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు. మీరు మీ జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మీరు జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మీ సినిమాలోని 'ఉదా కలర్ రిబ్బన్..' పాట నాకెంతో ఇష్టం. లెక్కలేనన్ని సార్లు చూశాను'' అని పేర్కొన్నారు. శివ కార్తికేయన్ సినిమాలోని పాటను పవన్ ప్రస్తావించడంతో అందరికి దానిపై ఆసక్తి కలిగింది. ఇక పవన్ మెసేజ్ ని ఊహించని శివ కార్తీకేయన్ సంతోషంలో మునిగిపోయారు. ''మీ రిప్లైకు ధన్యవాదాలు సార్. నా 'ఉదా కలర్ రిబ్బన్..' పాట మీకు నచ్చడంతో నాకెంతో గొప్పగా అనిపిస్తోంది. మీ సమయాన్ని వెచ్చించి నాపై ప్రేమను చూపించేలా ట్వీట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు'' అని శివ కార్తీకేయన్ ట్వీట్ చేశారు.
అయితే ఇప్పుడు పవర్ స్టార్ ప్రస్తవించిన 'ఉదా కలర్ రిబ్బన్..' సాంగ్ ని వెతకడం స్టార్ట్ చేశారు. ఈ సాంగ్ శివ కార్తికేయన్ - తెలుగమ్మాయి శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా నటించిన 'వరుత్తు పడాద వాలిబర్ సంఘం' అనే చిత్రంలోనిది. ఈ సినిమా తెలుగులో 'కరెంటు తీగ' పేరుతో రీమేక్ అయింది. ఇక 'ఉదా కలర్ రిబ్బన్..' సాంగ్ ని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ డి.ఇమ్మన్ స్వయంగా ఆలపించడం విశేషం. ఇప్పటికే ఈ సాంగ్ మంచి సాంగ్ అని గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ తనకెంతో ఇష్టమని ప్రస్తావించడంతో ఆయన అభిమానులు చూడటం స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న 'ఊదా కలర్ రిబ్బన్' పాట గురించి సోనీ మ్యూజిక్ సంస్థ పేర్కొంటూ 'అనుకోకుండా ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది' అని ట్వీట్ చేసింది. ఏదేమైనా సోషల్ మీడియాలో పవన్ క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పవచ్చు.