Begin typing your search above and press return to search.

VT12: లైఫ్ అండ్ డెత్ ఆట ఆరంభమైంది..!

By:  Tupaki Desk   |   11 Oct 2022 4:33 AM GMT
VT12: లైఫ్ అండ్ డెత్ ఆట ఆరంభమైంది..!
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో VT12 ప్రాజెక్ట్ ను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ను మేకర్స్ షురూ చేశారు.

ఇటీవల 'ది ఘోస్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రవీణ్ సత్తారు.. ఇప్పుడు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా వెంటనే వరుణ్ తేజ్ సినిమాని సెట్స్ మీదకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది.

ఇందులో వరుణ్ తేజ్ గన్స్ లోడ్ చేస్తూ.. షాట్ కోసం రెడీ అవుతుండటాన్ని బట్టి చూస్తే ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. దీని కోసం మెగా హీరో ఫిజికల్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఈ వీడియోలో వరుణ్ సెట్స్‌ లో అడుగుపెట్టడం.. కార్వాన్ లో తన పాత్ర కోసం సిద్ధమవడం మనం చూడవచ్చు.

ప్రవీణ్ సత్తారు మొదటి షాట్‌ కి దర్శకత్వం వహిస్తూ.. మానిటర్ లో తీక్షణంగా చూస్తున్నాడు. ఇక్కడ మనం పక్కనే చిత్ర నిర్మాత BVSN ప్రసాద్‌ ని కూడా చూడవచ్చు. అలానే ఈ వీడియోలో చివరగా బులెట్ పై 'ది గేమ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ బిగిన్స్' అనే క్యాప్షన్ ని పేర్కొన్నారు.

VT12 షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా 'ఆలోచనలు ట్రిగ్గర్‌ ను లాగుతాయి.. కానీ స్వభావం గన్ ని లోడ్ చేస్తుంది! లెట్స్ డూ దిస్ మ్యాన్ ప్రవీణ్ సత్తారు' అని వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం లండన్ లో జరగనుందని టాక్.

ఇకపోతే మెగా బ్రదర్ నాగబాబు చాలా గ్యాప్ తర్వాత తనయుడు నటిస్తున్న ఈ సినిమాతో నిర్మాణంలో భాగం అవుతున్నారు. SVCC బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని లేటెస్ట్ వీడియోలో ప్రస్తావించారు.

వరుణ్ తేజ్ కు జోడీగా 'ఏజెంట్' ఫేమ్ సాక్షి వైద్య ను హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు టాక్. అలానే విలన్‌ గా వినయ్ రాయ్‌ ని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే వరుణ్ తేజ్ 12వ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.