Begin typing your search above and press return to search.

'కంచె 2' ప్లాన్ చేస్తున్న మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్..!

By:  Tupaki Desk   |   15 April 2020 3:20 PM IST
కంచె 2 ప్లాన్ చేస్తున్న మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్..!
X
మెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు వ‌రుణ్ తేజ్. తొలి చిత్రం 'ముకుంద'తోనే తనలో మంచి నటుడు దాగున్నాడని నిరూపించుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుండి విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కంచె - ఫిదా - తొలిప్రేమ - ఎఫ్ 2 చిత్రాలలో తనదైన మార్క్ నటనతో మంచి విజయాలను అందుకుంటున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చిన మీడియం రేంజ్ హీరోల్లో వ‌రుణ్ తేజ్ కే ఎక్కువ హిట్లు ఉన్నాయని చెప్పవచ్చు. వరుణ్ తేజ్ కమర్షియల్ చిత్రాల వెనుక ప‌రుగులెత్త‌కుండా కాస్త కంటెంట్ ఉన్న క‌థ‌ల్నే ట్రై చేస్తున్నాడు. ప్ర‌స్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలో నటిస్తున్నాడు. దాంతో పాటు అనీల్ రావిపూడి తెరకెక్కించబోతున్న 'ఎఫ్ 3' కూడా చేయనున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ తన కెరీర్ స్టార్టింగ్ లో మంచి ఇమేజ్ తీసుకొచ్చిన కంచె చిత్రానికి సీక్వెల్ చేయాలని ఆలోచిస్తున్నాడట.

ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన త‌రువాత కంచె 2 స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడట. దీని కోసం 'కంచె 2' క‌థ రెడీ చేయ‌మ‌ని త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న రైట‌ర్స్ తో వ‌రుణ్ చెబుతున్న‌ట్లుగా సమాచారం. ఇదే విష‌యాన్ని వ‌రుణ్ ఇప్ప‌టికే ప‌లు సార్లు బ‌య‌టకి చెప్పేశాడు కూడా. 2015లో విడుదలైన 'కంచె' సినిమా వరుణ్ తేజ్ హీరోగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కింది. వార్ బేసెడ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా జాతీయస్థాయి అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా గొల్లపూడి మారుతీ రావు - షావుకారు జానకి - నిఖితిన్ దీర్ - అవసరాల శ్రీనివాస్ - పోసాని కృష్ణ మురళి - సత్యం రాజేష్ ప్రధాన పత్రాలు పోషించారు. ఈ సినిమా వచ్చిన ఐదేళ్లకి మళ్ళీ అలాంటి వార్ బేస్ డ్ ల‌వ్ స్టోరీలో మ‌ళ్లీ న‌టించాల‌ని వ‌రుణ్ కోరుకుంటున్నాడ‌ట‌. అలాంటి కంటెంట్ తో స్టోరీ ఎవరు రెడీ చేస్తారో చూడాలి. స్టోరీ రెడీ అయిన వెంటనే కంచె 2 పట్టాలెక్కే అవకాశం ఉంది.