Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం 'మెగా' బ్రాండ్ ను వాడుకుంటున్న వరుణ్ తేజ్..!

By:  Tupaki Desk   |   19 Jan 2021 5:01 PM GMT
ఫస్ట్ టైం మెగా బ్రాండ్ ను వాడుకుంటున్న వరుణ్ తేజ్..!
X
మెగా హీరో వరుణ్ తేజ్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ ఇంతవరకు తాను నటించే సినిమాలలో మెగా రెఫరెన్స్ ఎప్పుడూ యూస్ చేసుకోలేదు. అయితే ఇప్పుడు వరుణ్ నటిస్తున్న సినిమాలో మెగా రిఫరెన్స్ ఉపయోగించుకోవడం గమనార్హం. వరుణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాకి ''గని'' అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 'బాలు' సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ పేరు 'గని'. ఇప్పుడు అందులో బాబాయ్ పేరునే అబ్బాయ్ సినిమా టైటిల్ గా పెట్టుకున్నాడు. అయితే నిజానికి 'గని' టైటిల్ ని నాగ‌శౌర్య నటించిన 'అశ్వ‌ధామ' సినిమాకి పెట్టాలని అనుకున్నాడట. అయితే అప్ప‌టికే ఇది వేరే వాళ్ల పేరు మీద రిజిస్ట‌ర్ అవ్వ‌డంతో నాగ‌శౌర్య ఈ టైటిల్ ని వ‌దిలేశాడని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా సినీ స‌ర్కిల్స్ లో మాత్రం ఈ సినిమా టైటిల్ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాక్ట్ చేసిన 'బాలు' సినిమానే హిట్ అవ్వ‌లేదు.. ఇప్పుడు అందులో ప‌వ‌న్ క్యారెక్ట‌ర్ పేరునే టైటిల్ గా పెట్టుకున్న సినిమాను జ‌నాలు ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తారో అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇది పవన్ నటించిన 'త‌మ్ముడు' సినిమా క‌థని పోలి ఉంటుందనే టాక్ ఉంది. ఇక వరుణ్ తేజ్ తొలిసారి మెగా బ్యానర్ లో నటిస్తున్నాడు. అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ ఫిలింస్‌ - అల్లు బాబీ పిక్చర్స్ పతాకాలపై అల్లు బాబీ - సిద్ధు ముద్ద కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొర్రపాటి కిరణ్‌ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.