Begin typing your search above and press return to search.

బాక్సర్‌ గనిను ప్రేమ కిక్‌ తో పడేసిందట

By:  Tupaki Desk   |   19 April 2021 5:30 PM GMT
బాక్సర్‌ గనిను ప్రేమ కిక్‌ తో పడేసిందట
X
వరుణ్‌ తేజ్ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న 'గని' సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా కాస్త నెమ్మదిగా సాగుతూ ఉంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో కలిసి హీరోయిన్‌ సయి మంజ్రేకర్‌ షూటింగ్‌ లో పాల్గొంటుంది. బాలీవుడ్ నుండి దిగుమతి అయిన ఈ అమ్మడు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. సినిమా యూనిట్‌ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం సినిమా ఖచ్చితంగా యూత్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందట.

సయి మంజ్రేకర్‌ ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌ పాత్రలో కనిపించబోతుంది. బాక్సార్ అయిన గనితో కాలేజ్ స్టూడెంట్‌ అయిన మాయ ఎలా పరిచయం అయ్యింది. ఇద్దరి మద్య జరిగిన రొమాంటిక్ సన్నివేశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. బాక్సింగ్‌ సన్నివేశాలతో పాటు హీరో హీరోయిన్‌ మద్య జరిగే సన్నివేశాలు కూడా ప్రతి ఒక్కరిని కట్టిపడేసే విధంగా ఉంటాయని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. బాక్సింగ్‌ తో ప్రత్యర్థులను చితు చేసే గనిని మాయ తన ప్రేమ అనే కిక్‌ తో ఎలా చిత్తూ చేసిందో దర్శకుడు కిరణ్ కొర్రపాటి చాలా ఆసక్తికరంగా చూపించాడంటున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ ఇప్పటికే ప్రకటించినా కూడా కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా తేదీ విషయంలో మార్పు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఒక వైపు ఎఫ్ 3 సినిమా లో నటిస్తూనే మరో వైపు ఈ సినిమాలో వరుణ్ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా కాస్త గ్యాప్‌ తో బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. వరుణ్ గత చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా లపై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి.