Begin typing your search above and press return to search.

ఊరమాస్ అవతారంలో మెగా హీరో

By:  Tupaki Desk   |   5 July 2018 10:54 AM GMT
ఊరమాస్ అవతారంలో మెగా హీరో
X
కొంత మంది హీరోలు మాస్ బాడీ లాంగ్వేజ్ ఉన్నప్పటికీ లవర్ బాయ్స్ గానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటారు. ఫుల్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలి అంటే అంత ఈజీ కాదు. కానీ ఆ తరం నుంచి ఈ తరం వరకు ప్రతి ఒక్క హీరో కూడా ఎక్కువగా మాస్ ఆడియెన్స్ నే ఎట్రాక్ట్ చేయాలని అనుకుంటారు. ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ మనసు అటు వైపు మల్లినట్లు ఇప్పుడు అర్ధమవుతోంది.

మనోడి గత సినిమాలు ఎక్కువగా సాఫ్ట్ గా వచ్చినవే. అర్బన్ బాయ్ లుక్ లో సాఫ్ట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించి ఫిదా - తొలిప్రేమ లాంటి హిట్స్ అందుకున్నాడు. ఇక మొన్నటి వరకు వ్యోమగామి కాస్ట్యూమ్ తో షూటింగ్ లో పాల్గొన్నాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో స్పేస్ తరహా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న F2 సినిమాలో లుక్ మొత్తం మార్చేశాడు. ఈ రోజు హైదరాబాద్ లో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

మిడిల్ క్లాస్ లైఫ్ కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించిన దర్శకుడు హీరో వరుణ్ ని మాస్ లుక్ లో ప్రజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుణ్ మరియు అతని ఫ్రెండ్ పాత్ర చేస్తున్న కళ్యాణ్ ప్రియదర్శి లుంగీలో కనిపిస్తుండడం చూస్తుంటే మాస్ లుక్ లో వరుణ్ అదరగొట్టేలా ఉన్నాడని చెప్పవచ్చు. మరి ఈ లుంగీ లుక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. వెంకటేశ్ కూడా F2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.