Begin typing your search above and press return to search.

#మెగా హీరో‌.. కోవిడ్ కి వేడి పానీయంతో ట్రీట్మెంట్?

By:  Tupaki Desk   |   31 Dec 2020 12:05 PM IST
#మెగా హీరో‌.. కోవిడ్ కి వేడి పానీయంతో ట్రీట్మెంట్?
X
మెగా హీరోలు కోవిడ్ భారిన ప‌డుతుండ‌డం అభిమానుల‌కు క‌ల‌వ‌రపెడుతోంది. మెగాస్టార్ చిరంజీవికి కోవిడ్ అన‌గానే అది బ్యాడ్ సంకేతంగా భావించారు. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌- వ‌రుణ్ తేజ్ ల‌కు కోవిడ్ సోకింది. ప్ర‌స్తుతం వీరంతా స్వీయ‌నిర్భంధంలోకి వెళ్లి చికిత్సను కంటిన్యూ చేస్తున్నారు. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే త‌మ ఫేవ‌రెట్ స్టార్లు కోలుకుని తిరిగి షూటింగుల‌కు ఎటెండ‌వుతార‌ని అభిమాను‌లు ఆకాంక్షిస్తున్నారు.

ఇక‌పోతే చ‌ర‌ణ్ - ఉపాస‌న జోడీ స్వీయ నిర్భంధంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న ఫోటోలు ఇంత‌కుముందు వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఫోటో అభిమానుల్లోకి దూసుకొచ్చింది. అత‌డు చాలా సింపుల్ గా బ్లాక్ టీ తీసుకుంటూ క‌నిపించాడు.

అన్న‌ట్టు అల్లు శిరీష్ చెప్పిన‌ట్టు ఏదైనా ఆయుర్వేద చికిత్స అల్లోప‌తిని మించిన గొప్ప రిజ‌ల్ట్ ఇస్తుంద‌ని అనుకుంటే బ్లాక్ టీ కూడా ఆ కేట‌గిరీనే అనుకోవాల్సి ఉంటుంది. అల్లోప‌తి మందులు మింగినా ఆయుర్వేదం ప‌ని చేస్తుంది. ఇక వేడి వేడి కాఫీ-టీ .. బ్లాక్ టీ వంటివి క‌రోనాను గొంతులోంచి కిందికి క‌డుపులోకి దించేస్తాయ‌ని అక్క‌డ అవి యాసిడ్స్ వ‌ల్ల నిర్వీర్యం అవుతాయ‌ని వైద్యులు చెప్పారు కాబ‌ట్టి ఇది మంచి చికిత్స‌. చైనీయుల్లానే ఇక‌పై భార‌తీయులు కూడా వేడి వేడి పానీయాలు సేవిస్తూ ప్ర‌తి గంటా జాగ్ర‌త్త‌గా ఉండాల‌నే సందేశ‌మే ఇది. క‌రోనా స్ట్రెయిన్ విజృంభ‌ణ నేప‌థ్యంలో ఇలాంటి జాగ్ర‌త్త‌ల్ని అస్స‌లు విడువ కూడదు. క‌నీసం త‌ర‌చుగా ప్ర‌తి గంట‌కు వేడి పానీయాల స్వీక‌ర‌ణ అనే అల‌వాటు తెలుగు ప్ర‌జ‌లు మ‌ర్చిపో‌కూడ‌ద‌ని సందేశ‌మే ఇది. శానిటైజ‌ర్ తీసుకెళ్ల‌డం.. మాస్క్ ధ‌రించ‌డం.. వేడి పానీయాలు స్వీక‌రించి ఆవిరి ప‌ట్ట‌డం ఇవే సుర‌క్షిత‌మైన విధానాలు. ఇది 2021లోనూ ఏడాదంతా కంటిన్యూ చేయడం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం.