Begin typing your search above and press return to search.

వీడియో : మెగా కండల 'గని' కన్నుల వింధు

By:  Tupaki Desk   |   3 Aug 2021 4:13 AM GMT
వీడియో : మెగా కండల గని కన్నుల వింధు
X
మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం గని సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ మరియు సిద్దులు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కరోనా వల్ల ఆలస్యం అవుతున్న ఈ సినిమా పై రోజు రోజుకు అంచనాలు మెగా ఫ్యాన్స్ పెంచేసుకుంటూనే ఉన్నారు. తాజాగా వరుణ్‌ షేర్‌ చేసిన ఓ వీడియో సినిమాపై మరింతగా ఆసక్తిని కలిగిస్తుంది. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరణ్‌ తేజ్ మాంచి ఫిజిక్ తో కనిపించబోతున్నాడు అనే విషయం ఇంతకు ముందే క్లారిటీ ఇచ్చారు. బాక్సింగ్‌ లో శిక్షణ కోసం ఒలింపిక్స్ విజేతల వద్ద వరుణ్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయి కోచ్‌ ల వద్ద టిప్స్ ను తీసుకున్నాడు. ఒక ప్రొఫెషనల్‌ బాక్సర్ లా కనిపించేందుకు బాడీని మార్చుతున్నాడు.

సినిమాలో చాలా కీలకం అయిన బాక్సింగ్‌ సన్నివేశాలను చిత్రీకరించేందుకు గాను వరుణ్‌ తేజ్ కండలు పెంచాడు. సిక్స్‌ ప్యాక్ తో పాటు బ్యాక్‌ మజిల్స్ కూడా అద్బుతంగా కనిపించబోతున్నాయి. ఫేమస్ ఫిజికల్‌ ట్రైనర్ ఆధ్వర్యంలో వరుణ్ తేజ్ ఫిజికల్‌ వర్కౌట్స్ చేస్తున్నాడు. తాజాగా వరుణ్ షేర్‌ చేసిన ఈ వీడియోను చూస్తుంటే వావ్‌ అనేట్లుగా ఉంది. కండల వీరుడు అనే ట్యాగ్‌ ను వరుణ్‌ కు ఇవ్వాలి అన్నట్లుగా ఉందంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నాడు. మెగా హీరోలు ఒక సినిమా కోసం.. ఒక పాత్ర కోసం ఎంతగా కష్టపడతారు అనేది ఈ వీడియోను చూస్తే అర్థం అవుతుంది అంటున్నారు.

ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ లుక్‌ మాత్రమే కాకుండా కథ కూడా చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా తో వరుణ్‌ తేజ్‌ ఓ కమర్షియల్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం గని సినిమాలో మాత్రమే కాకుండా ఎఫ్‌ 3 సినిమాలో కూడా నటిస్తున్నాడు. వెంకటేష్‌ తో కలిసి ఆ సినిమా లో వరుణ్‌ తేజ్ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నాడు. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో గతంలో వచ్చిన ఎఫ్‌ 2 సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడం వల్ల ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

మరో సారి ఎఫ్ 3 లో ఎంటర్‌ టైన్ మెంట్‌ ను ఫుల్‌ గా జోడించి మరీ అనీల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. వెంకటేష్ కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా వరుణ్‌ తేజ్ కు జోడీగా మెహ్రీన్‌ నటిస్తోంది. ఎఫ్‌ 2 లో నటించిన వీళ్లే మళ్లీ రిపీట్‌ అయ్యారు. ఎఫ్‌ 3 లో అదనంగా సునీల్‌ కామెడీని జొప్పిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే మెగా కండల వీరుడు గని సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నరు. అలాగే ఎఫ్ 3 విడుదల విషయంలో కూడా స్పష్టత వస్తుందని నమ్మకంగా మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మెగా ప్రిన్స్‌ గత చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా లపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఎఫ్ 3 సినిమా ఫుల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను గని సినిమా ఓ మంచి కమర్షియల్‌ మూవీగా నిలుస్తుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ ఏడాదిలో ఒకటి వచ్చే ఏడాదిలో మరోటి వచ్చేలా ప్లాన్‌ చేస్తాడేమో చూడాలి.