Begin typing your search above and press return to search.

#స్లీప్ ఓవ‌ర్.. 90ల‌లో మెగా క‌జిన్స్ అంతా ఓచోట ఇలా..!

By:  Tupaki Desk   |   21 Dec 2020 3:30 PM GMT
#స్లీప్ ఓవ‌ర్.. 90ల‌లో మెగా క‌జిన్స్ అంతా ఓచోట ఇలా..!
X
ఇటీవ‌లే నిహారిక కొణిదెల వివాహంలో మెగా క‌జిన్స్ అంతా సంద‌డి సంద‌డి చేశారు. ఈ వేడుక‌లో నిహారిక అన్న‌లు వ‌రుణ్ తేజ్ .. రామ్ చ‌ర‌ణ్ స‌హా బావ‌లు అల్లు అర్జున్.. శిరీష్.. మేన బావ‌లు సాయి తేజ్.. వైష్ణ‌వ్ తేజ్ బోలెడంత సంద‌డి చేశారు. మెగా క‌జిన్స్ గ్యాంగ్ సంద‌డి వేడుక‌కే హైలైట్ అయ్యింది. ఆ ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేశాయి.

ఇక‌పోతే వ‌రుణ్ తేజ్ ఇప్ప‌టికీ ఈ పెళ్లి వేడుక లో అరుదైన ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేస్తున్నారు. అలాగే త‌మ బాల్యంలోని జ్ఞాప‌కాల్ని అత‌డు ఏమాత్రం దాచుకోవ‌డం లేదు. తాజాగా ఇన్ స్టాలో ఓ రేర్ ఫోటోని షేర్ చేసి దాని వెన‌క ఉన్న ఆస‌క్తిక‌ర సంగ‌తిని చెప్పారు వ‌రుణ్.

90ల‌లో మెగా క‌జిన్స్ అంతా ఓచోట ఇలా నిదురించార‌ట‌..! ఇందులో రామ్ చ‌ర‌ణ్ - వ‌రుణ్ తేజ్ కుడివైపుగా ఒక‌రిపై ఒక‌రు చెయ్యేసి బుస‌లు కొడుతూ నిదురిస్తున్నారు. ఎడ‌మ వైపుగా చిన్నారులైన‌ శ్రీ‌జ .. తేజ్ బ్ర‌ద‌ర్స్ అయిన‌ సాయి తేజ్ .. వైష్ణ‌వ్ తేజ్ నిదురిస్తున్నారు. అన్న‌ట్టు మెగా మేన‌ల్లుళ్లు సాయి ధ‌ర‌మ్ తేజ్ ని జెట్ పంజా అని వైష్ణ‌వ్ తేజ్ ని పంజా అని పిలుస్తారు క‌జిన్స్. త్రోబ్యాక్ జ్ఞాప‌కం ఇంట్రెస్టింగ్ క‌దూ!