Begin typing your search above and press return to search.

కొత్త ప్రేమ జంట సెల్ఫీ అదిరే

By:  Tupaki Desk   |   12 May 2017 3:19 PM GMT
కొత్త ప్రేమ జంట సెల్ఫీ అదిరే
X
సినిమాల విషయంలో ఏ జోనర్ కి అయినా ఎక్స్ పైరీ ఉంటుందేమో కానీ.. ప్రేమ అనే కాన్సెప్ట్ మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే కొత్తగా వచ్చే దర్శకులైనా.. తమను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నించేవారైనా.. ప్రేమకథలను ఆశ్రయించడం చూస్తూనే ఉంటాం. మాంచి పేరు సంపాదించుకుని.. ఆ తర్వాత బాగా వెనకబడ్డ దర్శకుడు శేఖర్ కమ్ముల.. ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా ఫిదా అంటూ లవ్ స్టోరీనే రూపొందిస్తున్నాడు.

ఈ ప్రేమకథలో హీరోయిన్ గా మలయాళ ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. ప్రస్తుతం ఈ ఫిదా షూటింగ్ జరుగుతుండగా.. మంచు కొండల్లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ స్పాట్ నుంచి హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ సాయి పల్లవి ఓ సెల్ఫీ దిగి అభిమానులతో పంచుకున్నారు. కొత్త లుక్ తో వరుణ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో.. అంతకు మించిన అందంతో మెరిసిపోతోంది సాయి పల్లవి. ఇద్దరి జంట మరీ అద్భుతంగా ఉంటే.. ఇద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీ కేక పుట్టించేసింది.

మలయాళీ కుట్టి సాయి పల్లవికి టాలీవుడ్ లో ఇది అరంగేట్ర చిత్రం. శేఖర్ కమ్ముల దర్శకత్వం.. దిల్ రాజు నిర్మాణం.. మెగా హీరో వరుణ్ తేజ్.. మల్లూ బ్యూటీ అందం.. ఈ సినిమాకి అట్రాక్షన్స్ బోలెడున్నాయి. అమెరికాలో సుదీర్ఘమైన షెడ్యూల్ జరుపుకున్న తర్వాత ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/