Begin typing your search above and press return to search.

మల్టీస్టారర్ చేస్తానంటున్నాడు!!

By:  Tupaki Desk   |   22 April 2017 9:41 AM GMT
మల్టీస్టారర్ చేస్తానంటున్నాడు!!
X
మన తెలుగు చిత్రసీమకు నాలుగు స్తంభాలు.. చిరంజీవి - నాగార్జున - బాలయ్య - వెంకీ.. కలసి చేసిన మల్టీస్టారర్లే లేవు. ఈ మధ్య వెంకీ దానికి నాంది పలికినా కూడా ఎవ్వరూ అంతగా ముందుకు తీసుకువెళ్లే వాళ్ళు లేరు. ఇప్పుడు వస్తున్న వాళ్ళలో చాలా మంది ముల్టీస్టార్ మూవీస్ పై మక్కువ చూపిస్తున్నారు. మంచి కథ తో వస్తే మేము రెడీ అంటున్నారు.

కెరియర్ ఎర్లీ దశ లో ఉన్న వరుణ్ తేజ్ కి ఇప్పుడు ముల్టీ స్టార్ సినిమాలపై చాలా ఇంట్రెస్ట్ ఉందట. తను మొదటి నుండి ఆఫ్ బీట్ సినిమాలు ఎంచుకొని కమర్షియల్ సక్సెస్ కొట్టకపోయినా.. మిష్టర్ కూడా బాక్స్ ఆఫీసు దగ్గర విఫలం చెందినా.. శేఖర్ కమ్ముల తో చేస్తున్ ఫిదా తనను రైట్ ట్రాక్ లో పెడుతుందని భావిస్తున్నాడు ఈ మెగా హీరో. అయితే ఇదే సమయంలో ఒక మల్టీస్టార్ మూవీకోసం రెడీ అవుతున్నట్లు తెలిపాడు.

మల్టీ స్టార్ట్ సినిమాలు చేయడం ఇష్టమే అని.. పైగా మంచి ఫ్రెండ్ అయన అఖిల్ తో అయీతే చాలా హాపీ అని చెప్పాడు. వరుణ్ కి ఇప్పుడు సక్సెస్ కావాలి.. అలానే అఖిల్ కూడా సక్సెస్ కోసం ఎదుచూస్తున్నాడు. అఖిల్ ఇప్పుడు విక్రమ్ కుమార్ డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. మొదటి సినిమా ఫ్లాప్ తో అఖిల్ ఈ సినిమా చాలా జాగ్రతగా చేస్తునాడు. మరి మైనస్ అండ్ మైనస్ కలిస్తే ప్లస్ అవుతుంది కాబట్టి.. ఈ యంగ్ హీరోలిద్దరూ కలసి ఒక సినిమా చేస్తారేమో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/