Begin typing your search above and press return to search.

టెస్ట్ లో మిస్టర్ పాస్ అవుతాడా!?

By:  Tupaki Desk   |   31 March 2017 5:00 AM GMT
టెస్ట్ లో మిస్టర్ పాస్ అవుతాడా!?
X
వరుణ్ తేజ్ నటించిన మిస్టర్ ఏప్రిల్ 13న రిలీజ్ కాబోతోంది. ఈ మెగా హీరో కెరీర్ మరి కొన్ని మెట్లు ఎక్కేందుకు ఈ సినిమా చాలా ముఖ్యం. అరంగేంట్రంలోనే రెండు మంచి సినిమాలు చేశాడనే పేరు తెచ్చుకున్న నాగబాబు తనయుడికి.. ఆ తర్వాత అంతగా కలిసిరాలేదు.

పూరీ జగన్నాధ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో చేసినా.. లోఫర్ రూపంలో ఫ్లాప్ ఎదుర్కోవాల్సి వచ్చింది. మంచి టేస్ట్ ఉన్న సినిమాలు చేస్తాడనే పేరు సంపాదించుకున్నా.. కెరీర్ పరుగులు పెట్టేందుకు ఇది చాలదు. కమర్షియల్ సక్సెస్ సాధించాల్సిన అవసరం వరుణ్ తేజ్ పై చాలా ఉంది. పైగా ఏడాదికి పైగా ఈ హీరో సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. మరోవైపు శ్రీను వైట్లకు కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో బౌన్స్ బ్యాక్ అయేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలతో.. మిస్టర్ ను అత్యంత జాగ్రత్తగా రూపొందించాడు. కెరీర్ ఇంకా పూర్తిగా పట్టాలు ఎక్కక ముందే.. వరుసగా స్టార్ డైరెక్టర్లతో చేసే అవకాశం రావడం చూస్తే.. వరుణ్ తేజ్ లక్కీ అనాల్సిందే.

'నా కెరీర్ ప్రారంభంలోనే శ్రీనువైట్లతో సినిమా చేయడం నా అదృష్టం. ఈ సినిమాలో నేను కామెడీ చేసేందుకు ప్రయత్నించాను. నాకు ఇది పూర్తిగా కొత్త' అంటున్నాడు వరుణ్ తేజ్. కామెడీ సినిమాల విషయంలో శ్రీను వైట్ల మార్క్.. టాలీవుడ్ లో ఓ బెంచ్ మార్క్ అయింది. మరి వరుణ్ తేజ్ కు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనున్నాడో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/