Begin typing your search above and press return to search.

వరుణ్‌ తేజ్ పిచ్చోళ్ళని చేస్తాడా??

By:  Tupaki Desk   |   2 Feb 2018 6:00 PM IST
వరుణ్‌ తేజ్ పిచ్చోళ్ళని చేస్తాడా??
X
ప్రేమ కథ. ప్రతీ సినిమాలోనూ ఎంతో కొంత ఇలాంటి కథ ఉండనే ఉంటుంది. యాక్షన్ సినిమాలో ఓ రెండు సీన్లలో హీరోయిన్ పడిపోయినా మనం దానిని లవ్ స్టోరీయే అనేస్తాం. ఎందుకంటే ఆ రెండు సీన్ల కోసం నాలుగు పాటలు కూడా ఉంటాయ్ కాబట్టి. అయితే ప్యూర్ గా ప్రేమకథలు అనేవి చాలా రేర్ గా వస్తుంటాయి. అలాంటి వాటిలో మనం మర్చిపోలేని సినిమాలు చాలానే ఉన్నాయి కాని.. జనాలను పూర్తి స్థాయిలో ప్రేమ పిచ్చోళ్ళని చేసిన సినిమాలు కొన్నే ఉన్నాయి.

సుమంత్ యువకుడు. రామ్ చరణ్‌ ఆరెంజ్. నాగచైతన్య ఏ మాయ చేశావే. ప్రభాస్ డార్లింగ్. నితిన్ ఇష్క్. ఆర్తి చాబ్రియా ఒకరిఒకరు. మణిరత్నం ఓకె బంగారం.. ఈ సినిమాలన్నీ ప్రేమకథల్లో ప్రేమను విపరీతంగా పండించిన సినిమాలు. అయితే ఈ ప్రేమకథలతో జనాలను పిచ్చోళ్ళని చేసి సదరు హీరోలను స్టార్లను చేసిన సినిమాలు చాలా తక్కువే ఉన్నాయి. వాటిలో కమల్ హాసన్ మరోచరిత్ర.. పవన్ కళ్యాణ్‌ తొలిప్రేమ.. మాధవని సఖి.. అనే చెప్పాలి. వీరందరిలో పవన్ కళ్యాణ్‌ మాత్రం ఒక టాప్ రేటెడ్ స్టార్ అయిపోయాడు. ఆ తరువాత మెగా ఫ్యామిలీ నుండి సదరు యంగ్ హీరోలు ఇటువంటి ప్రేమకథలు అక్కడక్కడా ప్రయత్నించినా అవి ఫలించలేదు. అందుకే ఇప్పుడు అందరూ వరుణ్‌ తేజ్ 'తొలిప్రేమ' కథపై ఆతృతగా చూస్తున్నారు.

హిట్టయ్యే ప్రేమ కథ వేరు.. ఫ్లాప్ అయ్యి కూడా ఐకానిక్ గా నిలిచిపోయే ప్రేమ కథ వేరు.. హిట్టయ్యి ఐకానిక్ గా నిలిచిన పవన్ కళ్యాణ్‌ తొలిప్రేమ వేరు. మరి ఇప్పుడు వరుణ్‌ తేజ్ సినిమా ఆ స్థాయిని అందుకుంటుందా? నిజానికి ఈ సినిమా ట్రైలర్లో కామెడీ కాస్త ఎక్కువైపోవడం వలన.. లేదంటే యాక్షన్ సీన్ అక్కడక్కడా కనపబడటం వలన.. ఇది పూర్తి స్థాయి ప్రేమ కథేనా అని కొన్ని సందేహాలు వస్తున్నప్పటికీ.. ఇది పూర్తిగా ఒక ప్రేమ కథే అంటున్నారు సినిమా యునిట్ సభ్యులు. చూద్దాం మరి వరుణ్‌ జనాలను పిచ్చోళ్ళను చేస్తాడో లేదో. అదేనండీ ప్రేమ పిచ్చోళ్ళని!!