Begin typing your search above and press return to search.

మెగా కుర్రాడు.. ‘రీజన్’ చెప్పడేంటి?

By:  Tupaki Desk   |   28 Sep 2015 9:30 AM GMT
మెగా కుర్రాడు.. ‘రీజన్’ చెప్పడేంటి?
X
75 ఏళ్ల కిందటి నేపథ్యంతో సినిమా తీయడమంటే మాటలు కాదు. అందులోనూ అది వార్ బ్యాగ్రౌండ్ లో అంటే ఇంకా కష్టం. షూటింగ్ పూర్తి చేయడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ క్రిష్ మాత్రం ‘కంచె’ సినిమాను మొదలుపెట్టిన ఐదారు నెలల్లో ఫినిష్ చేసేశాడు. అలాగని క్వాలిటీ ఏమీ తగ్గినట్లు కనిపించలేదు. ట్రైలర్ చూస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కనిపించాయి. ఐతే అంత వేగంగా సినిమా పూర్తి చేసేసిన క్రిష్.. సినిమాను అనుకున్న తేదీకి మాత్రం విడుదల చేయలేకపోయాడు. ఇంకో రెండు వారాల్లో సినిమా రిలీజ్ అనగా సడెన్ గా ‘వాయిదా’ వార్త బయటికి వచ్చింది.

హీరో వరుణ్ తేజ్ స్వయంగా సినిమాను నెల రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ కారణం మాత్రం చెప్పలేదు. త్వరలోనే ఆ రీజన్ ఏంటో వెల్లడిస్తాం అన్నాడు వరుణ్. ఇలా చెప్పి వారం గడిచిపోయింది. కానీ ‘కంచె’ ఎందుకు వాయిదా పడింది.. సినిమా స్టేటస్ ఏంటి.. పోస్ట్ ప్రొడక్షన్ ఎంతవరకు వచ్చింది.. లాంటి విషయాలేవీ వెల్లడించలేదు వరుణ్. దీంతో ‘కంచె’కు రిపేర్లేమైనా జరుగుతున్నాయేమో అని డౌట్ కొడుతోంది. మరోవైపు క్రిష్ కూడా పత్తా లేదు. పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఏమైనా తేడాలుంటే.. ఏవైనా అదనపు ఆకర్షణలు జోడిస్తుంటే ఆ సంగతి చెప్పేయొచ్చు కదా. అవి సినిమాకు మరింత ఆకర్షణ తెచ్చిపెట్టేవే కదా. మరెందుకు మౌనం పాటిస్తున్నట్లు?