Begin typing your search above and press return to search.

#ట్రెండీ లుక్‌: బాహుబ‌లి + భ‌ళ్లా= గ‌ని

By:  Tupaki Desk   |   14 Nov 2021 1:30 PM GMT
#ట్రెండీ లుక్‌: బాహుబ‌లి + భ‌ళ్లా= గ‌ని
X
బాహుబ‌లి .. బ‌ళ్లాలుడికే చెమ‌ట‌లు ప‌ట్టించే లుక్ ఇది. కిక్ బాక్స‌ర్ గ‌ని ఒక్క లుక్ తో మైండ్ బ్లాక్ చేశాడు. ఒక్కో పిడుగుద్దుతో ఒక్కొక్క‌రిని మ‌ట్టి క‌రిపించే భీక‌ర బాహుబ‌ల రూపంతో మైక్ టైస‌న్ కే డాడీలా క‌నిపిస్తున్నాడు. వ్వాటే లుక్ దిస్ ఈజ్ గ‌నీ! అనేంత‌గా మైండ్ లో ప్రింట్ వేస్తున్నాడు. టోన్డ్ మ‌జిల్స్ ఉప్పొంగిన న‌రాలు .. 6ప్యాక్ రూపం అస‌లు ఆ దేహశిరిని చూసి ముచ్చ‌ట‌ప‌డ‌ని అమ్మాయి ఉంటుందంటారా? అస‌లు మెగా ప్రిన్స్ యేనా ఇలా మారాడు?

ఫిట్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ లా మారాడు వరుణ్ తేజ్. నేటిత‌రానికి స్ఫూర్తి నింపేలా ఈ లుక్ అదుర్స్. గ‌ని కోసం వ‌రుణ్ తేజ్ పూర్తిగా మేకోవ‌ర్ అయిన తీరు అబ్బుర‌ప‌రుస్తోంది. డిసెంబర్ లో గ‌ని సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు. కిరణ్ కొర్రపాటి రచించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ స్పోర్ట్స్ డ్రామా ఇది.

రెనైసాన్స్ పిక్చర్స్- అల్లు బాబీ కంపెనీ బ్యానర్ లపై సిద్ధు ముద్దా -అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. వరుణ్ తేజ్ స‌ర‌స‌న ఈ చిత్రంలో స‌యీ మంజ్రేకర్ నాయిక‌గా న‌టిస్తోంది. ఈ బ్యూటీ డెబ్యూ సినిమాతో కుర్ర‌కారు మ‌తులు చెద‌ర‌గొడుతుంద‌ని అంతా భావిస్తున్నారు. క‌రోనా క్రైసిస్ వ‌ల్ల చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మైంది. ఎట్ట‌కేల‌కు గ‌ని బాక్సాఫీస్ బ‌రిలోకి దిగే స‌మ‌య‌మాస‌న్న‌మైంది. ఇక‌పై టీమ్ ప్ర‌చారంలో వేడి పెంచ‌నుంద‌ని స‌మాచారం. బాక్స‌ర్ గా మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ స్పెష‌లిస్టుగా వ‌రుణ్ తేజ్ త‌న‌ని తాను స‌రికొత్త‌గా ఆవిష్క‌రించుకోనున్న ఈ సినిమా కోసం మెగాభిమానులు స‌హా ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. నాకౌట్ పంచ్ ల‌తో వ‌రుణ్ ఎలాంటి ఆట ఆడ‌తాడో చూడాలి.