Begin typing your search above and press return to search.

నాన్న క్లాప్ అమ్మ స్విఛాన్ తో వ‌రుణ్ తేజ్ మూవీ షురూ

By:  Tupaki Desk   |   28 March 2022 6:51 AM GMT
నాన్న క్లాప్ అమ్మ స్విఛాన్ తో వ‌రుణ్ తేజ్ మూవీ షురూ
X
మ‌న స్టార్స్ మునుపెన్న‌డూ లేనంత‌గా సినిమాల ప‌రంగా స్పీడు పెంచేశారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి కిర‌ణ్ అబ్బ‌వ‌రం వ‌ర‌కు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ కి రెడీగా వుంటే మ‌రో చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తున్నారు. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ త‌ను కూడా అంద‌రిలాగే స్పీడు పెంచేశాడు. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ న‌టించిన రెండు చిత్రాలు ఎఫ్ 3, గని విడుద‌ల‌కు సిద్ధం గా వున్నాయి. ఎఫ్ 3 మేలో విడుద‌ల కాబోతుండ‌గా, గ‌ని ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఇదిలా వుంటే తాజాగా వ‌రుణ్ తేజ్ మ‌రో చిత్రాన్ని ప్రారంభించేశారు. ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సోమ‌వారం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ ఎల్ పీ బ్యాన‌ర్ పై బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్, బాపినీడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు ఫిల్మ్ న‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో జ‌రిగాయి. అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో వ‌రుణ్ తేజ్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో పాటు ఫ్రెండ్స్ పాల్గొన్నారు.

పూజాకార్య‌క్ర‌మాల అనంత‌రం హీరో వ‌రుణ్‌ తేజ్ పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు క్లాప్ నివ్వ‌గా వ‌రుణ్ తేజ్ మ‌ద‌ర్ కెమెరా స్విఛాన్ చేశారు.

స‌రికొత్త యాక్ష‌న్ డ్రామాగా రూపొంద‌నున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని వ‌చ్చే నెల నుంచి ప్రారంభించ‌బోతున్నారు. ఇందు కోసం చిత్ర బృందం యుకె ప‌య‌నం కాబోతోంది. `పీఎస్ వీ గరుడ వేగ` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్ర‌వీణ్ స‌త్తారు ఈ మూవీని స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

అఖిల్‌ `ఏజెంట్‌` చిత్రం ద్వారా తెలుగు తెర‌కు హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతున్న సాక్షీ వైద్య ఈ మూవీలో వ‌రుణ్ తేజ్ కు జోడీగా న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం టాక్స్ జ‌రుగుతున్నాయ‌ని, ఆమెని ద‌ర్శ‌కుడు ఫైన‌ల్ చేశార‌ని తెలిసింది. ప్ర‌వీణ్ స‌త్తారు ప్ర‌స్తుతం కింగ్ నాగార్జున‌తో `ది ఘోస్ట్‌` మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీ కీల‌క యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తో పాటు ఓ రొమాంటిక్ సాంగ్ ని దుబాయ్ లో చిత్ర బృందం పూర్తి చేసింది.