Begin typing your search above and press return to search.
నిహారిక వెడ్డింగ్: అన్నాచెల్లెళ్ల సందడే సందడి
By: Tupaki Desk | 8 Dec 2020 12:38 PM ISTకొణిదెల వారమ్మాయి నిహారిక వివాహం జొన్నలగడ్డ వారబ్బాయి చైతన్యతో జరగనుంది. పెద్దలు కుదిర్చిన వివాహమిది. రాజస్థాన్ ఉదయ్ ప్యాలెస్ లో ఈనెల 9 సాయంత్రం అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరగనుంది. ఇరువైపులా బంధుమిత్రులు అతిథులు ఇప్పటికే వెన్యూ చెంత వాలిపోయి సందడి చేస్తున్నారు.
ప్రీవెడ్డింగ్ సంగీత్ కి సంబంధించి రకరకాల ఫోటోలు వీడియోలు ఇప్పటికే అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ఇంతకుముందు హబ్బీ చైతన్యతో కలిసి నిహారిక ఎంతో హుషారుగా జోష్ తో డ్యాన్సులు చేస్తున్న వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
తాజాగా మరికొన్ని వీడియోలు రివీలయ్యాయి. ఓ వీడియోలో అన్న వరుణ్ తేజ్ భుజాలపైకి ఎక్కి నిహారిక కోతికమ్మచ్చి ఆట ఆడేస్తోంది. ఎంతో ఫన్ తో ఆకట్టుకుంటున్న ఈ వీడియో వైరల్ గా మారింది. ఓ చెలీ తెలుసా తెలుసా? తెలుగు మాటలు పదివేలు! అంటూ రెహమాన్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ లో ఎంతో ప్లెజెంట్ గా వినిపిస్తోంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం అంటే వరుణ్ - నిహారికనే గుర్తు చేసుకునేలా ఈ వేడుకలో ఫోటోలు వీడియోలు ఆల్బమ్ లో దర్శనమివ్వనున్నాయి. చెల్లి పెళ్లి వేడుకను అన్నీ తానే అయ్యి వరుణ్ నడిపిస్తున్నారు. వెన్యూ చెంత పెద్దలకు శ్రమ ఇవ్వకుండా ప్రతిదీ తానే చూసుకుంటున్నారు. కుమారుని ఏర్పాట్లన్నీ నాగబాబు- చిరంజీవి పర్యవేక్షిస్తున్నారు.