Begin typing your search above and press return to search.

టూ మచ్‌ గా బాడీ పెంచేస్తున్న మెగా హీరో

By:  Tupaki Desk   |   15 April 2021 2:00 PM IST
టూ మచ్‌ గా బాడీ పెంచేస్తున్న మెగా హీరో
X
మెగా ఫ్యామిలీ హీరోలు ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా ఇండస్ట్రీలో సెటిల్‌ అయ్యేందుకు స్టార్‌ డంను కొనసాగించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. మెగా ఫ్యామిలీ అవ్వడం వల్ల ఎంట్రీ ఈజీగానే దక్కించుకుంటున్న వారు సక్సెస్‌ లు కొట్టేందుకు మాత్రం సొంత కష్టంను నమ్ముకోవాల్సిందే అనే విషయాన్ని చాలా తొందరగానే తెలుసుకుంటున్నారు. అలా తెలుసుకున్న వెంటనే తాము చేస్తున్న సినిమాల్లో పాత్రలకు ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. తద్వారా వారి సినిమాలు మంచి విజయాలను దక్కించుకుంటున్నాయి అంటున్నారు. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ 'గని' సినిమా కోసం ఏకంగా రెండేళ్ల నుండి కష్టపడుతున్నాడు.

బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. సిద్దుతో కలిసి ఈ సినిమా ను అల్లు బాబీ నిర్మిస్తున్నాడు. పూర్తి స్థాయి సినిమా నిర్మాతగా అల్లు బాబీ మారడం జరుగుతుంది. ఈ సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ ను ఒలింపిక్స్‌ బాక్సింగ్‌ విజేతల వద్దకు ట్రైనింగ్‌ కోసం పంపించడంతో పాటు ఎన్నో రకాల విద్యలను ఆయనకు నేర్పించడం జరిగింది. గని సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ చాలా బరువు పెరుగుతున్నాడట. ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ కోసం వరుణ్‌ చాలా లావు కనిపించాల్సి ఉందట. అందుకోసం నిజంగానే వరుణ్‌ చాలా బరువు పెరిగినట్లుగా చెబుతున్నారు.

ఈమద్య కాలంలో వరుణ్‌ ను చూస్తే బాహుబలి రేంజ్ లో ఉన్నాడు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారట. రాజమౌళి యాక్షన్‌ సినిమాకు సరిగ్గా సూట్‌ అయ్యే పర్శనాలిటీ అంటూ వరుణ్‌ ను ఉద్దేశించి అంటున్నారట. మరో వైపు వరుణ్‌ ఎఫ్‌ 3 సినిమా లో నటిస్తున్నాడు. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్‌ తో వరుణ్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న విషయం తెల్సిందే.