Begin typing your search above and press return to search.

వరుణ్ కూడా బహుమతిస్తాడా..?

By:  Tupaki Desk   |   29 July 2015 10:38 AM IST
వరుణ్ కూడా బహుమతిస్తాడా..?
X
మునుపెన్నడూ లేనంత ఉత్సాహం ఇప్పుడు మెగా అభిమానులలో కనపడుతోంది. దానికి కారణం చిరు రీ ఎంట్రీనే. ఆగష్టు 22న చిరు పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి 150వ సినిమా లాంచనంగా ప్రారంభం కానుంది. దీనితోపాటుగా చిరు పుట్టినరోజు కానుకగా చిరు తనయుడు రామ్ చరణ్ మెగా అభిమానులకు తన సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని సిద్దమవుతున్నారు. చరణ్ తమ్ముడు వరుణ్ కూడా అదే బాటలో వెళ్తున్నట్టు సమాచారం.

ముకుందగా వరుణ్ మెగా అభిమానులను అసంతృప్తికి గురిచేశాడు. రెండు సినిమా అయిన కంచెలో కథ క్రిష్ మార్క్ లోనే వున్నా దాన్ని చూపించిన విధానం కమర్షియల్ గా ఉంటుందని వినికిడి. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆగష్టు లో విడుదల చేస్తారట. తేదీ ప్రకటించనప్పటికీ ఆగష్టు నెలలోనే అనేది స్పష్టమవుతోంది. చూస్తుంటే ఆగష్టు 22నే అనిపిస్తోంది. అదే నిజమయితే మెగా అభిమానులకు డబుల్ ధామాకే మరి..