Begin typing your search above and press return to search.

రెండు మెగా సినిమాలూ ఒకేసారి రెడీ

By:  Tupaki Desk   |   14 July 2015 3:27 AM GMT
రెండు మెగా సినిమాలూ ఒకేసారి రెడీ
X
అయితే సినిమాలే ఉండవ్‌. లేకపోతే వరుసగా సునామీయే. అతివృష్టి, అనావృష్టి అంటే ఇదే కాబోలు. ప్రస్తుతం మెగా క్యాంపు నుండి కంటిన్యూస్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌ కరువైంది. గత సంవత్సరం వచ్చినవాటిలో రేసుగుర్రం ఒక్కటే కిక్కించ్చింది. గోవిందుడు, పిల్లానువ్వులేని.., ముకుంద సినిమాలు బాగున్నాయ్‌ అని చెప్పినా కూడా బాగా ఆడలేదు. ఈ ఏడాది ప్రస్తుతానికి సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి ఒక్కటే. మరి నెక్ట్స్‌ ఎవరొస్తున్నారు?

ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం ఒకేసారి రెండు సినిమాలతో రెడీ అంటున్నారు మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌. ఇప్పటికే సుప్రీమ్‌ హీరో అనే టైటిల్‌తో దూసుకొస్తున్న ఈ యువకుడు క్రిష్‌ డైరక్షన్‌లో చేసిన ''కంచె'' సినిమాను అక్టోబర్‌ 2 నాటికి విడుదల చేద్దామని అనుకుంటున్నాడనే సంగతి తెలిసిందే. విశేషం ఏంటంటే.. సరిగ్గా ఇదే నాటికి పూరి జగన్‌ తీస్తున్న ''లోఫర్‌'' కూడా రెడీ అయిపోతుంది. అంటే అక్టోబర్‌లోనే రెండు సినిమాలు రెడీగా ఉంటాయ్‌ అనమాట. రామ్‌చరణ్‌ చేస్తున్న శ్రీను వైట్ల సినిమా, సాయిధరమ్‌ 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'.. ఇలాంటి మెగా మూవీస్‌ ఎప్పటికి రెడీ అయినా కూడా.. వరుణ్‌ తేజ్‌ మాత్రం దూసుకొచ్చేస్తాడు. బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ లా కాకుండా పెద్దనాన్న చిరంజీవినే ఫాలో అవుతున్నాడనమాట. గుడ్‌ గోయింగ్‌ హీరో.