Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ లో గత్తరలేపిన గద్ధలకొండ

By:  Tupaki Desk   |   22 Sept 2019 8:48 PM IST
బిగ్ బాస్ లో గత్తరలేపిన గద్ధలకొండ
X
ఈ శుక్రవారమే రిలీజై థియేటర్లలో సందడి చేస్తున్న 'గద్దలకొండ గణేష్' కు బజ్ మరింతగా పెంచేందుకు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్ర హీరో వరుణ్ తేజ్ ఇప్పటికే జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తాజాగా అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 షోకు హాజరయ్యాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది.

గెస్ట్ అయిన వరుణ్ కు నాగ్ ఇంట్రో ఇస్తూ 'లెట్స్ వెల్కం గద్దలకొండ గణేష్' అనగానే జీన్స్.. బ్లాక్ కలర్ లాంగ్ షర్టు ధరించి రెడ్ కలర్ గ్లాసెస్ తో రఫ్ గా వచ్చాడు వరుణ్. ఇక ఈ ప్రోమోలో మొదటి డైలాగే అదిరిపోయింది. "మనం హౌస్ లో ఉన్నమని నలుగురికి తెల్వకపోతే ఇగ హౌస్ లో ఉండుడు ఎందుకురా?" అంటూ గద్దలకొండ గణేష్ స్టైల్లో చెప్పడంతో విజిల్స్ పడ్డాయి. ప్రొమోలో శ్రీముఖి.. హిమ‌జ‌.. పున‌ర్న‌వి ముగ్గురూ వ‌రుణ్ కు ప్ర‌పోజ్ చేశారు.

పునర్నవి "చాలా వీక్ నేను ప్రపోజల్స్ లో" అని చెప్తే.. నాగార్జున అందుకుని "ఇక్కడ వరుణ్ 'తెలుసు' అంటున్నాడు" అంటూ షాక్ ఇచ్చాడు. దీంతో పునర్నవి నోరెళ్ళబెట్టింది. "ప్రపోజ్ చేయాలంటే నాకు చేతులు వణుకుతున్నాయి" అని పునర్నవి చెప్తే వరుణ్ అందుకుని నాగార్జునతో మాట్లాడుతూ "ఆ అమ్మాయి నాకు చెప్పలేకపోతుందంటే..ఇంకెక్కడో చెప్పింది సార్" అంటూ లాజిక్ చెప్పాడు. "నీ ల‌గ్గ‌మెప్పుడు.. దావ‌త్ ఎప్పుడో చెప్పాలి మ‌రి" అని శివ‌జ్యోతి వరుణ్ ను అడిగితే "హౌస్ నుండి బ‌య‌ట‌కు రాగానే మ‌స్త్ దావ‌త్ ఇస్తా" అంటూ హామీ ఇచ్చాడు. చూస్తుంటే గద్దలకొండ గణేష్ బిగ్ బాస్ లో గత్తరలేపినట్టుందే!