Begin typing your search above and press return to search.

వెంకటేశ్‌ కూడా పొట్టి వాడైపోయాడు

By:  Tupaki Desk   |   21 Dec 2018 11:31 AM GMT
వెంకటేశ్‌ కూడా పొట్టి వాడైపోయాడు
X
ఇండస్ట్రీలో చాలామంది హీరోలున్నా.. ఆజానుభాహుల్లాంటి హీరోలు చాలా కొద్దిమందే. మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగన అగ్రహీరోల్లో చిరంజీవి, బాలకష్ణ ఇద్దరూ ఇంచుమించు ఒకే హైట్‌. ఆ తర్వాత నాగార్జున, వెంకటేష్‌ ఇద్దరూ ఒక హైట్‌. ప్రభాస్‌, గోపీచంద్‌ లాంటి హీరోలు వచ్చేవరకు ఇండస్ట్రీలో నాగ్‌, వెంకీనే బాగా పొడుగ్గా ఉన్న హీరోలు.

వెంకటేశ్‌ హైట్‌ 6 అడుగుల 2 అంగుళాలు. ఎలాంటి హీరోయిన్‌ అయినా వెంకీ పక్కన పర్‌ఫెక్ట్‌ సూట్‌ అవుతుంది. అందులే శిల్పాశెట్టి లాంటి హీరోయిన్‌ తో కూడా స్టెప్పులేశాడు. అలాంటి వెంకీ ఇప్పుడు సడన్‌ గా పొట్టివాడైపోయాడు. వెంకీని పొడుగ్గా చూపించేందుకు ఎఫ్‌2 మూవీ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి చాలా కష్టాలు పడ్డాడు. దానికి కారణం వెంకీ పక్కన మరో హీరోగా నటించిన వరుణ్‌ తేజే. వరుణ్‌ బీభత్సమైన హైట్‌.6 అడుగుల 4 అంగుళాలు.

మరి అలాంటివాడి పక్కన నించుంటే.. ఎవరైనా రమణారెడ్డి పక్కన రేలంగి లానే కన్పిస్తారు. అందుకే ఎఫ్‌2 సినిమా లో దాదాపు అన్ని సీన్స్‌ లో వెంకీ పొట్టోడుగానే కన్పించాడు. ఇక పాటల్లో అయితే వెంకీ పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎంత ట్రై చేసినా వరుణ్‌ తేజ్‌ ని డామినేట్‌ చేయడం వెంకీ వల్ల కాలేదు. అందుకే పాటల్లో వరుణ్‌ ని స్క్రీన్‌ చివరకు తోసేశారు. మరి వెంకీ, వరుణ్‌ కాంబినేషన్‌.. రేలంగి, రమణారెడ్డి లా సూపర్‌ హిట్‌ అవుతుందేమో వెయిట్‌ అండ్‌ సీ.