Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్ రిస్క్ కే రెడీ అయ్యాడా?

By:  Tupaki Desk   |   1 March 2018 3:25 PM IST
వరుణ్ తేజ్ రిస్క్ కే రెడీ అయ్యాడా?
X
సినిమాల విషయంలో అగ్రిమెంట్స్ చాలా ముఖ్యం. హీరోలు.. నిర్మాతలు.. దర్శకులు.. పరస్పరం ఒకరితో ఒకరు అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటూ ఉంటారు. ఈ సమయంలోగా సినిమా చేయాలని.. తర్వాతి సినిమా తమకే చేయాలని.. తమకు చేశాకే ఇంకోళ్లకు చేయాలని లాంటి ఆబ్లిగేషన్స్ ఉంటాయి. గతేడాది ఘాజి మూవీతో సక్సెస్ సాధించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి.. తన తర్వాతి సినిమాను పార్థసారధి అనే నిర్మాతకు చేసేందుకు కమిట్ అయ్యాడు.

వీరిద్దరూ ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారనే విషయం బైటకు రాలేదు కానీ.. వీరి మధ్య వివాదం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు చేరుకుంది. ఇంతకీ అసలు గొడవ ఏంటంటే.. ఇప్పుడు ఈ సంకల్ప్ రెడ్డి పార్థసారధితో కాకుండా.. క్రిష్- రాజీవ్ రెడ్డిలు నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. స్పేస్ కాన్సెప్ట్ తో రూపొందే తన సినిమాకు.. పార్థసారధి కంటే రాజీవ్ రెడ్డి బెటర్ అని ఫిక్స్ అవడమే ఇందుకు కారణం. ఈ విషయం తెలిసి కూడా వరుణ్ తేజ్ సినిమాకు సై అనేశాడు.

ఈ సమయంలో సంకల్ప్ రెడ్డిపై పార్థసారధి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను అప్రోచ్ అయ్యాడు. అయినా సరే.. తన చిత్రాన్ని క్రిష్ టీంతోనే కంటిన్యూ చేసేందుకు రెడీ అయ్యాడట వరుణ్ తేజ్. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రస్తుతం క్రిష్ అండ్ రాజీవ్ రెడ్డిలు తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు.