Begin typing your search above and press return to search.

వరుణ్ లేకపోతే 'తొలిప్రేమ' సినిమా ఆగిపోయేదే!

By:  Tupaki Desk   |   6 April 2022 10:28 PM IST
వరుణ్ లేకపోతే తొలిప్రేమ సినిమా ఆగిపోయేదే!
X
టాలీవుడ్ లో బాక్సింగ్ నేపథ్యంలో రెండు మూడు సినిమాలు రూపొందుతూ వచ్చాయి. వాటిలో వరుణ్ తేజ్ హీరోగా చేసిన 'గని' ఈ నెల 8వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లలో దిగిపోనుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి, ఈ సినిమా నటీనటులు .. సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. వరుణ్ తేజ్ తో గతంలో 'తొలిప్రేమ' చేసిన వెంకీ అట్లూరి ఈ ఫంక్షన్ కి    హాజరయ్యాడు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. " ఈ సినిమా కోసం వరుణ్ చాలా కష్టపడ్డాడనే విషయం తెలుస్తూనే ఉంది. ఆయనతో జర్నీ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

  ఇండస్ట్రీకి అవకాశాల కోసం వచ్చినప్పుడు ఒక్క ఛాన్స్ దొరికితే చాలు అన్నట్టుగా ఉంటుంది. నా ఫస్టు సినిమా వరుణ్ తో చేసిన 'తొలిప్రేమ'. ఆ సినిమా దాదాపు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వరుణ్ లేకపోతే ఆ ప్రాజెక్టు ఆగిపోయి ఉండేది.  వరుణ్ లేకపోతే ' తొలిప్రేమ' అనే ఆ సినిమా ఉండేదే కాదు. ఈ రోజున నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం ఆయనే. ఆ రోజున నాకు ఎలా అయితే ఆయన హెల్ప్ చేశారో .. ఈ రోజున కిరణ్ కొర్రపాటికి కూడా అలాగే హెల్ప్ చేశారు. కిరణ్ కొర్రపాటితో ఆయనకి ఉన్న పరిచయం కారణంగానే ఈ ఛాన్స్ ఇచ్చారు.

నా కెరియర్ ఆరంభంలో 'తొలిప్రేమ' నాకు ఎంత పెద్ద హెల్ప్ అయిందో .. కిరణ్ కి కూడా అంతే హెల్ప్ కావాలని కోరుకుంటున్నాను. ఇక నేను ఉపేంద్రగారి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఆయన ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో సయీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. రోమియో వెంట జూలియట్ లా అనిపిస్తోంది.

ఇక నేను షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ .. చిన్న చిన్న పాత్రలు వేస్తూ వస్తున్నాను. అప్పుడు యాక్టింగ్ మానేసి డైరెక్షన్ వైపు వెళ్లమని అల్లు బాబీ చెప్పారు. ఆ రోజున ఆయన చేసిన ఆ సూచన వల్లనే ఈ రోజున మీ ముందు డైరైక్టర్ గా నిలబడి ఉన్నాను. అందుకు ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాలో తమన్ స్వరపరిచిన రోమియో జూలియట్ సాంగ్ నాకు బాగా నచ్చేసింది" అని చెప్పుకొచ్చాడు.